IND VS NEP: నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం.. సూపర్ 4లో ఎంట్రీ | Asia Cup 2023, IND vs NEP: Toss And Playing XI Of Both Teams Updates - Sakshi
Sakshi News home page

IND Vs NEP Updates: నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం .. సూపర్ 4లో ఎంట్రీ

Published Mon, Sep 4 2023 2:32 PM

Asia Cup 2023 IND Vs NEP: Toss Playing XI Of Both Teams Updates - Sakshi

Asia Cup, 2023 India vs Nepal: ఆసియా వన్డే కప్‌-2023 టీమిండియా వర్సెస్‌ నేపాల్‌ అప్‌డేట్స్‌

నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో టీమిండియా మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరుకుంది. రోహిత్‌ శర్మ (74), శుభ్‌మన్‌ గిల్‌ (67) పరుగులతో రాణించారు. వర్షం కారణంగా అంపైర్లు DLS పద్ధతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు అందించారు. ఈ టార్గెట్‌ను రోహిత్-గిల్ జోడీ 20.1 ఓవర్లలో సాధించారు.

టీమిండియా టార్గెట్‌ 145
వర్షం తగ్గిపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన టీమిండియా టార్గెట్‌ను 145గా నిర్ధేశించారు. 23 ఓవర్లలో భారత్‌ ఈ టార్గెట్‌ను ఛేజ్‌ చేయాల్సి ఉంటుంది. 

వర్షం అంతరాయం.. ఓవర్లు కుదిస్తే భారత్‌ టార్గెట్‌ ఎంతంటే..?
45 ఓవర్లలో 220
40 ఓవర్లలో 207
35 ఓవర్లలో 192
30 ఓవర్లలో 174
20 ఓవర్లలో 130

బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌.. మళ్లీ మొదలైన వర్షం
231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు వరుణుడు మరోసారి స్వాగతం పలికాడు. 2 ఓవర్ల తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. 2.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 17/0గా ఉంది. శుభ్‌మన్ గిల్‌ (12), రోహిత్‌ శర్మ (4) క్రీజ్‌లో ఉన్నారు.

రాణించిన జడ్డూ, సిరాజ్‌.. నేపాల్‌ 230 ఆలౌట్‌
వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్‌-నేపాల్‌ మ్యాచ్‌లో నేపాల్‌ 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్‌ షేక్‌ (58), సోంపాల్‌ కామీ (48), కుషాల్‌ భుర్టెల్‌ (38), దీపేంద్ర సింగ్‌ (29), గుల్షన్‌ ఝా (23) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. 

47 ఓవర్లలో నేపాల్‌ స్కోరు: 227/7

 ఏడో వికెట్‌ కోల్పోయిన నేపాల్‌
41.1: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్‌ 29(25) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నేపాల్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. స్కోరు:  194/7 (41.1). సందీప్‌ లమిచానే, సోంపాల్‌ కమీ(25) క్రీజులో ఉన్నారు.

వర్షం తర్వాత మొదలైన ఆట
40 ఓవర్లలో నేపాల్‌ స్కోరు: 184-6

భారత్‌తో వర్సెస్‌ నేపాల్‌.. మళ్లీ వర్షం మొదలు
సమయం సాయంత్రం 05:44: టీమిండియా- నేపాల్‌ మ్యాచ్‌కు వరణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. స్కోరు: 178/6 (37.5)

ఆరో వికెట్‌ కోల్పోయిన నేపాల్‌
31.5: గుల్షన్‌ ఝా 23(35)  రూపంలో నేపాల్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి గుల్షన్‌ పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 144/6 (31.5)

►మొదలైన ఆట.. చినుకులు తగ్గడంతో మళ్లీ మ్యాచ్‌ మొదలైంది.

సమయం సాయంత్రం 05:05: చిరుజల్లులు మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.

29.5: హాఫ్‌ సెంచరీ హీరో అవుట్‌
నిలకడగా ఆడుతున్న నేపాల్‌ ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌(58(97)ను సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో నేపాల్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 132/5

27.2: అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఆసిఫ్‌ షేక్‌..
స్కోరు: 
114/4 (27.3

25 ఓవర్లలో నేపాల్‌ స్కోరు: 109-4

21.5: నాలుగో వికెట్‌ కోల్పోయిన నేపాల్‌
జడేజా బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన కుశాల్‌ మల్లా 2(5). అసిఫ్‌ షేక్‌ 45, గుల్షన్‌ ఝా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన నేపాల్‌.. 20 ఓవర్లలో నేపాల్‌ స్కోరు
19.6: రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్‌ బౌలింగ్‌తో మాయ చేశాడు. దీంతో నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడేల్‌ 5(8) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 20 ఓవర్లలో నేపాల్‌ స్కోరు: 93-3

18.5: కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఆసిఫ్‌ షేక్‌ అవుటైనట్లు అంపైర్‌ సిగ్నల్‌ ఇవ్వగా రివ్యూకు వెళ్లిన నేపాల్‌కు సానుకూలంగా నిర్ణయం వచ్చింది. స్కోరు: 92/2 (19.4)
రెండో వికెట్‌ కోల్పోయిన నేపాల్‌
15.6: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నేపాల్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ భీమ్‌ షర్కీ 7(17) బౌల్డ్‌. దీంతో నేపాల్‌ రెండో వికెట్‌ ‍కోల్పోయింది. స్కోరు 77/2 (16).

15 ఓవర్లలో నేపాల్‌ స్కోరు:  73-1
తొలి వికెట్‌ కోల్పోయిన నేపాల్‌

9.5: ఎట్టకేలకు టీమిండియాకు వికెట్‌ దక్కింది. పదో ఓవర్‌ ఐదో బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో కుశాల్‌ 38(25) [4s-3 6s-2] ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆసిఫ్‌(23), భీమ్‌ షార్కీ క్రీజులో ఉన్నారు.

దంచికొడుతున్న నేపాల్‌ ఓపెనర్లు
8.5: హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్న నేపాల్‌. కుశాల్‌ 29, ఆసిఫ్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న నేపాల్‌ ఓపెనర్లు.. స్కోరు: 42-0(8)

5 ఓవర్లు ముగిసే సరికి నేపాల్‌ స్కోరు: 23/0
టీమిండియా ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేస్తున్న క్రమంలో ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 12, ఆసిఫ్‌ షేక్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచిన టీమిండియా
నేపాల్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.  ఈ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘బౌలింగ్‌ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. గత మ్యాచ్‌లో మెరుగైన స్కోరు కోసం మేము పోరాడాల్సి వచ్చింది. హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌ పాక్‌తో మ్యాచ్‌లో అద్బుతంగా రాణించారు. ఈసారి బౌలర్లకు అవకాశం ఇవ్వాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. 

బుమ్రా లేడు.. షమీ వచ్చాడు
నేపాల్‌తో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో.. ‘‘వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. బుమ్రా ఈరోజు అందుబాటులో లేడు. కాబట్టి షమీ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక నేపాల్‌ సారథి రోహిత్‌ పౌడేల్‌ ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. ఆరిఫ్‌ షేక్‌ స్థానంలో భీమ్‌ షర్కీ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.

తుది జట్లు ఇవే
టీమిండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

నేపాల్‌
కుశాల్ భుర్తేల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షార్కి, సోంపాల్ కామి, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లమిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షీ.

ఓడితే అంతే సంగతి
►గ్రూప్‌-ఏలో భాగమైన నేపాల్‌ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ముల్తాన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో పటిష్ట టీమిండియాతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇందులో ఓడితే ఇంటిబాట పడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement