breaking news
Akeal Hosein
-
డుప్లెసిస్ ధనాధన్ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీ.. ఎంఐకి ఓటమి
టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plesis) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. ఎంఐ న్యూయార్క్ జట్టుతో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 103 పరుగులు బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు.మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC-2025)లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ ఎంఐ న్యూయార్క్ జట్టుతో తలపడింది. డల్లాస్ వేదికగా సోమవారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ చేసింది.డుప్లెసిస్ ధనాధన్ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మిత్ పటేల్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.డుప్లెసిస్‌కు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సాయితేజ ముక్కామల్ల (18 బంతుల్లో 25), మార్కస్ స్టొయినిస్ (22 బంతుల్లో 25) రాణించగా.. డొనోవాన్ ఫెరీరా (Donovan Ferreira) మెరుపు హాఫ్ సెంచరీ (20 బంతుల్లో 53) సాధించాడు. సేవేజ్ రెండు పరుగులతో డుప్లెసిస్‌తో కలిసి అజేయంగా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 223 పరుగులు సాధించింది. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే, రుషిల్ ఉగార్కర్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ 184 పరుగులకే కుప్పకూలింది.పొలార్డ్ అర్ధ శతకం వృథాఓపెనర్ క్వింటన్ డికాక్ (35), ఆరో నంబర్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ (26) ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో అలరించాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఎంఐ న్యూయార్క్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. తద్వారా సూపర్ కింగ్స్ చేతిలో 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.సూపర్ కింగ్స్ బౌలర్లలో.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అకీల్ హుసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. నండ్రీ బర్గర్, మార్కస్ స్టొయినిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ సీజన్లో సూపర్ కింగ్స్‌కు ఏడింట ఇది ఐదో విజయం కాగా.. ఎంఐ న్యూయార్క్ మాత్రం ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచింది. సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. ఎంఐ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.𝐇𝐔𝐋𝐊 unleashed! 💥#TSKvMINY#WhistleForSuperKings#MLC2025pic.twitter.com/PX1OdzIdu1— Texas Super Kings (@TexasSuperKings) June 30, 2025 చదవండి: నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్ -
మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్.. నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్‌కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు కిందకు దించాడు. -
కళ్లు చెదిరే సిక్సర్.. విండీస్ బ్యాటర్ చర్య వైరల్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన క్వాలిఫయర్ పోరులో విండీస్ బ్యాటర్ రోవ్‌మెన్ పావెల్ భారీ సిక్సర్ బాదాడు. ఇప్పుడు ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అయింది పావెల్ కొట్టిన సిక్సర్ కాదు.. అకిల్ హొసేన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ బ్లెస్సింగ్ ముజరబానీ వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని రోవ్‌మెన్ పావెల్ లాంగాఫ్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. దాదాపు 104 మీటర్ల దూరం వెళ్లిన బంతి చాలా ఎత్తులో ఉంది. అందుకే అకిల్ హొసెన్ పావెల్ కొట్టిన సిక్స్‌ను కన్నార్పకుండా చూసి ''వామ్మో ఎంత పెద్ద సిక్స్'' అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అందుకే హొసెన్ ఎక్స్ప్రెషన్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్‌లో ఓపెనర్ చార్లెస్ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆపై బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ (4/16), జేసన్ హోల్డర్ (3/12) నిప్పులు చెరిగారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మదెవెర్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో లూక్ జాంగ్వే (22 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. మిగతా వారిలో ఆరుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రెండు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన విండీస్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ‘సూపర్ 12’ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 'టైటిల్ గెలవాలంటే చేయాల్సింది చాలా ఉంది' -
Ind Vs WI: ఆ ముగ్గురు చెలరేగితే ధావన్ సేనకు కష్టాలు తప్పవు!
India tour of West Indies, 2022: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా పలువురు టీమిండియా యువ బ్యాటర్లకు వన్డే జట్టులో చోటు దక్కింది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర కీలక బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తదితరులకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. ఈ సిరీస్ ద్వారా తామేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. ఇక పాకిస్తాన్ పర్యటనలో, స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో చిత్తై డీలా పడిన విండీస్‌ను.. ఓడించడం శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. టీమిండియా యువ బాట్యర్లకు ఈ ముగ్గురు విండీస్ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. Gearing up for ODI No.1 against the West Indies 💪 Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI — BCCI (@BCCI) July 21, 2022 అకీల్ హొసేన్ గతేడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్. ఆరంభంలో కాస్త తడబడ్డా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరీస్‌లో కేవలం ఒకే ఒక వికెట్ తీసినా.. ప్రస్తుత వన్డే సూపర్ లీగ్ భాగంగా ఆడిన 20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 35 వికెట్లు పడగొట్టాడు. తద్వారా లీగ్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు 29 ఏళ్ల అకీల్. టీమిండియా బ్యాటర్లకు అకీల్ సవాల్ విసురుతాడనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అకీల్ ఫామ్‌లోకి వస్తే రైట్ హ్యాండ్ బ్యాటర్లకు అతడితో తలనొప్పి తప్పదు. గుడకేశ్ మోటీ బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ముగిసిన వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేశాడు గుడకేశ్ మోటీ. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన లెఫ్టార్మ్ స్పిన్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో నికోలస్ పూరన్ సారథ్యంలో ఆడిన మోటీకి టీమిండియాతో సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండు. అదే జరిగితే 27 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు అంత సులువేమీ కాదు. జేడెన్ సీల్స్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ ఈ ఏడాది నెదర్లాండ్స్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న అతడికి కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ దక్కింది. అయితే బంతిని స్వింగ్ చేస్తూ జేడెన్ మంచి ఫలితాలు రాబట్టగలడు. ముఖ్యంగా ఈ 20 ఏళ్ల యువ పేసర్ డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడు. కరేబియన్, లంక ప్రీమియర్ లీగ్‌లో అతడు రాణించిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆండర్సన్ ఫిలిప్‌తో పాటు రొమారియో షెఫర్డ్ వన్డే సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో జేడెన్కు తుదిజట్టులో అవకాశం రావడం ఖాయంగానే కనిపిస్తోంది.. కాబట్టి అతడి బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడకపోతే టీమిండియా యువ బ్యాటర్లు మూల్యం చెల్లించకతప్పదు. ఇక జూలై 22 నుంచి టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్ చదవండి: Ind Vs WI ODI Series: వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ఓపెనర్‌గా రావాలి! అతడికి ఆ అర్హత ఉంది! India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు!