అఫ్రిది రీఎంట్రీ.. బాబర్‌ ఆజమ్‌కు మళ్లీ చుక్కెదురు | Shaheen Afridi Returns, No Babar Azam In T20Is As Pakistan Name Squads For WI Tour | Sakshi
Sakshi News home page

అఫ్రిది రీఎంట్రీ.. బాబర్‌ ఆజమ్‌కు మళ్లీ చుక్కెదురు

Jul 25 2025 5:06 PM | Updated on Jul 25 2025 5:10 PM

Shaheen Afridi Returns, No Babar Azam In T20Is As Pakistan Name Squads For WI Tour

త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ జట్లను ఇవాళ (జులై 25) ప్రకటించారు. టీ20 జట్టుకు సల్మాన్‌ అఘా, వన్డే జట్టుకు మహ్మద్‌ రిజ్వాన్‌ సారధులుగా ఎంపికయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్‌ అఫ్రిది టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు మరోసారి చుక్కెదురైంది. సెలెక్టర్లు బాబర్‌కు వన్డేలకు మాత్రమే పరిమితం చేశారు.

అఫ్రిది రాకతో పాక్‌ టీ20 జట్టు పేస్‌ బౌలింగ్‌ విభాగం మరింత బలపడింది. అఫ్రిదికి జతగా అనుభవజ్ఞులైన పేసర్లు హరీస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. మరో పేసర్‌ నసీం షా వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.

బ్యాటింగ్‌ విభాగంలో సైమ్‌ అయూబ్‌, ఫకర్‌ జమాన్‌, హసన్‌ నవాజ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, మొహమ్మద్‌ నవాజ్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. అబ్దుల్లా షఫీక్‌ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో సత్తా చాటిన సల్మాన్‌ మీర్జా, అహ్మద్‌ దనియాల్‌కు జట్టులో చోటు దక్కలేదు.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్‌ అయూబ్‌, షాహీన్‌ అఫ్రిది, సుఫ్యాన్‌ మొఖిమ్‌

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు పాక్‌ జట్టు..
మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మొహమ్మద్‌ నవాజ్, నసీం షా, సైమ్‌ అయూబ్‌, షాహీన్‌ అఫ్రిది, సుఫ్యాన్‌ మొఖిమ్‌

వెస్టిండీస్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ షెడ్యూల్‌..
జులై 31- తొలి టీ20 (ఫ్లోరిడా)
ఆగస్ట్‌ 2- రెండో టీ20 (ఫ్లోరిడా)
ఆగస్ట్‌ 3- మూడో టీ20 (ఫ్లోరిడా)

ఆగస్ట్‌ 8- తొలి వన్డే (ట్రినిడాడ్‌)
ఆగస్ట్‌ 10- రెండో వన్డే (ట్రినిడాడ్‌)
ఆగస్ట్‌ 12- మూడో వన్డే (ట్రినిడాడ్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement