బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (Bangladesh vs West Indies) వెస్టిండీస్ బోణీ కొట్టింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (ఆక్టోబర్ 27) జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
షాయ్ హోప్ (46 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (44 నాటౌట్), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓ మోస్తరు పోరాటం చేసి చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్, కెప్టెన్ అయిన లిట్టన్ దాస్ 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.
కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.
చదవండి: ఐసీయూ నుంచి బయటకు!


