టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ జట్టు ప్రకటన.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌కు అవకాశం | West Indies Announce 15 Member Squad For ICC T20 World Cup 2026, Check Out Names Inside | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ జట్టు ప్రకటన.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌కు అవకాశం

Jan 26 2026 8:44 PM | Updated on Jan 27 2026 12:55 PM

West Indies Announced T20 World cup 2026 squad

భారత్‌, శ్రీలంక వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్‌ హోప్‌ కొనసాగనుండగా.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌, 25 ఏళ్ల గయానీస్‌ బ్యాటర్‌ క్వెంటిన్‌ సాంప్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

మాజీ కెప్టెన్లు జేసన్‌ హోల్డర్‌, రోవ్‌మన్‌ పావెల్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కడం విశేషం​. పేసర్లుగా ఫోర్డ్‌, సీల్స్‌ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. స్పిన్‌ విభాగంలో ఆకీల్‌ హొసేన్, రోస్టన్‌ చేజ్, గుడకేశ్‌ మోటీ, ఆల్‌రౌండర్‌ విభాగంలో విధ్వంసకర బ్యాటర్‌ రొమారియో షెపర్డ్‌ అవకాశాలు దక్కించుకున్నారు. గాయాల కారణంగా ఎవిన్‌ లూయిస్‌, అల్జరీ జోసఫ్‌ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తంగా గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా, ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌  గ్రూప్‌-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో మిగతా జట్లుగా ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, నేపాల్‌, ఇటలీ ఉన్నాయి. విండీస్‌ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్‌పై తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఇదే వేదికపై వారు చివరిసారి వరల్డ్‌కప్‌ గెలిచారు.  

టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం విండీస్‌ జట్టు..
షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసిన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్

 

Advertisement
 
Advertisement
Advertisement