
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గ్రెనెడా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ హెరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక ఆసీస్ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలెక్స్ క్యారీ (26), పాట్ కమిన్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (71), కెమరూన్ గ్రీన్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. ట్రవిస్ హెడ్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు.
ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సామ్ కొన్‌స్టాస్ 0, ఉస్మాన్ ఖ్వాజా 2, నాథన్ లియోన్ 8, బ్యూ వెబ్‌స్టర్ 2 పరుగులకు ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (75) అర్ద సెంచరీతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ (40), అల్జరీ జోసఫ్ (27), షమార్ జోసఫ్ (29), షాయ్ హెప్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ 0, కీసీ కార్టీ 6, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 16, జస్టిన్ గ్రీవ్స్ 1, ఆండర్సన్ ఫిలిప్ 10 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ చెరో 2, స్టార్క్, వెబ్‌స్టర్, హెడ్ ఒక్కో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెబ్‌స్టర్ (60), క్యారీ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కొన్‌స్టాస్ 25, ఖ్వాజా 16, గ్రీన్ 26, స్టీవ్ స్మిత్ 3, హెడ్ 29, కమిన్స్ 17, స్టార్క్ 6, లియోన్ 11, హాజిల్‌వుడ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, సీల్స్ 2, షమార్ జోసఫ్, ఫిలిప్, గ్రీవ్స్ తలో వికెట్ తీశారు.
కాగా, ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ ఇది. తొలి టెస్ట్‌లో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.