న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ (Shai Hope) అద్భుత శతకంతో మెరిశాడు. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే ఈ సెంచరీ నమోదు చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (103) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.
జస్టిన్ గ్రీవ్స్‌తో (42) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 110 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాలంటే ఇంకా 349 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 182/4గా ఉంది. నాలుగో రోజు మూడో సెషన్ ఆట కొనసాగుతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవలేదు.
అంతకుముందు టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (466/8) చేసింది. కీమర్ రోచ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
దీనికి ముందు.. జేకబ్ డఫీ ఐదేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్ (56) రాణించాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.
అంతకుముందు న్యూజిలాండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. విండీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52) ఒక్కడే కివీస్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది.


