
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 (5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్, జులై 28) సందర్భంగా అతను అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ ఐసీసీ ఆగ్రహించి, అతని మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది.
ఆ మ్యాచ్‌లో డేవిడ్ అంపైర్ నిర్ణయం (వైడ్ బాల్ విషయంలో) పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఐసీసీ రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తించాడు. అంపైర్ అతను వైడ్‌గా భావించిన బంతిని ఫెయిర్ బాల్‌గా ప్రకటించడంతో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చేతులను చాచి చూపిస్తూ వైడ్‌గా ప్రకటించాలని అంపైర్‌ను ఆదేశించాడు. ఈ సందర్భంగా డేవిడ్ ప్రవర్తన దురుసుగా ఉందని ఐసీసీ భావించింది. డేవిడ్ క్రీడా స్పూర్తిని మరచి ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించింది. అలాగే ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.
డేవిడ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతనిని తదుపరి విచారణ నుంచి మినహాయించారు. ఆ మ్యాచ్‌లో డేవిడ్ 30 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఆ సిరీస్‌లో డేవిడ్ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో 37 బంతుల్లో శతక్కొట్టి ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. డేవిడ్ ఇటీవల ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతూ కూడా సత్తా చాటాడు. పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు.