
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడాడు.
ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తుది జట్లు..
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!