దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. మొదట పసలేని బౌలింగ్‌తో పరుగులు సమర్పించుకున్న భారత్.. తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా.. టీమిండియా 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఫర్వాలేదని పించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఎదురీదుతోంది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్ పేలవ ప్రదర్శన జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. సాయి 40 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ధ్రువ్ జురైల్(0), రిషబ్ పంత్(7), రవీంద్ర జడేజా(6), నితీశ్ కుమార్‌రెడ్డి (10) కూడా వరుసగా విఫలం కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
అయితే సోషల్ మీడియాలో సాయి సుదర్శన్‌పై నెటిజనులు ఎక్కువగా విమర్శలు కురిపిస్తున్నారు. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) స్థానంలో అతడికి జట్టులో చోటు కల్పించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కడానికి గిల్ కోటా కారణమని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ స్నేహితుడు కాబట్టే సాయికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ స్థానంలో అదే జట్టు ఆటగాడిని తప్ప మరొకని తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా కాగా, సాయి ఓపెనర్.
"గిల్ స్నేహితుడు కాబట్టి సాయి సుదర్శన్‌కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే చాలు ఇతర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతడినిటెస్టుల్లోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా కాదని ఓ నెటిజన్ ఎక్స్‌లో కామెంట్ చేశారు. దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) లాంటి వారిని కాదని సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నందుకు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కనీసం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. టెస్టులో సాయి ప్రదర్శన అంతంత మాత్రమేనని పెదవి విరిచారు. సీఎస్కే ఆటగాడు కాబట్టే రుతురాజ్‌ను జట్టులోకి తీసుకోవడం లేదని అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
చదవండి: రిషబ్ పంత్‌పై నెటిజన్ల మండిపాటు
టెస్టుల్లో విఫలం
తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ (Sai Sudharsan) గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో రెండు అర్ధసెంచరీలతో 288 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 87. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండవ టెస్ట్‌లో ఈ స్కోరు నమోదు చేశారు. 24 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం బ్యాటర్‌లో ఇప్పటివరకు 3 వన్డేలు ఆడి 127 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 28 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 6 సెంచరీలతో 1396 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 40 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 1793 పరుగులు బాదాడు. టెస్టుల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Sai Sudarshan
* 39 avg in the domestic
* 28 avg in Test
* Came into test team on IPL runs
* TN Ranji coach said his technique is not good enough for Test cricket
* Indian Assistant coach admitted his technique against Spin is not good
Playing on GT Captain Quota? #INDvSA pic.twitter.com/ul8U9pcWzJ— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) November 24, 2025
Another failure for Sai Sudharsan but still Ajit Agarkar and Gautam Gambhir are not going to pick Ruturaj Gaikwad.
Because Ruturaj Gaikwad plays for CSK. pic.twitter.com/zxrGlzldfx— Abhishek Kumar (@Abhishek060722) November 24, 2025


