నవంబర్ 5 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా జరుగబోయే మెన్స్ అండర్-19 IDFC ఫస్ట్ బ్యాంక్ వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2025 కోసం నాలుగు వేర్వేరు జట్లను బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది.
టీమ్-ఏకు కెప్టెన్‌గా విహాన్ మల్హోత్రా, టీమ్-బికి కెప్టెన్‌గా వేదాంత్ త్రివేది, టీమ్-సికి కెప్టెన్‌గా ఆరోన్ జార్జ్, టీమ్-డికి కెప్టెన్‌గా చంద్రహాస్ దాస్ ఎంపికయ్యారు.
ద్రవిడ్ కుమారుడికి బంపరాఫర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు (Anvay Dravid) బంపరాఫర్ వచ్చింది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన టీమ్-సిలో అతనికి చోటు దక్కింది. అన్వయ్ గత నెలలో కర్ణాటక అండర్-19 జట్టును వినూ మన్కడ్ ట్రోఫీ గెలిపించాడు. ఫైనల్లో కెప్టెన్ నాక్ (82 నాటౌట్) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
జట్ల వివరాలు..
టీమ్ A: విహాన్ మల్హోత్రా (C) (PCA), అభిజ్ఞాన్ కుందు (VC & WK) (MCA), వంశ్ ఆచార్య (SCA), బాలాజీ రావు (WK) (CSCS), లక్ష్య రాయ్‌చందాని (CAU), వినీత్ V.K (TNCA), మార్కండే పంచాల్ (UTCA), సాత్విక్ దేస్వాల్ (CAP), వీ యశ్‌వీర్ (HYCA), హేమ్‌చూడేశన్ (TNCA), R.S. అంబరీష్ (TNCA), హనీ ప్రతాప్ సింగ్ (RCA), వాసు దేవాని (GCA), యుధాజిత్ గుహా (CAB), ఇషాన్ సూద్ (PCA)
టీమ్ B: వేదాంత్ త్రివేది (C) (GCA), హర్వన్ష్ సింగ్ (VC & WK) (SCA), వాఫీ కచ్చి (HYCA), సాగర్ విర్క్ (PCA), సయన్ పాల్ (CAB), వేదాంత్ సింగ్ చౌహాన్ (PCA), ప్రణవ్ పంత్ (DDCA), ఎహిత్ సలారియా (WK) (UTCA), B.K. కిషోర్ (TNCA), అన్మోల్జీత్ సింగ్ (PCA), నమన్ పుష్పక్ (MCA), D దీపేష్ (TNCA), మహమ్మద్ మాలిక్ (HYCA), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (MCA), వైభవ్ శర్మ (KSCA)
టీమ్ సి: ఆరోన్ జార్జ్ (C) (HYCA), ఆర్యన్ యాదవ్ (VC) (PCA), అంకిత్ ఛటర్జీ (CAB), మణికాంత్ శివానంద్ (KSCA), రాహుల్ కుమార్ (PCA), యష్ కస్వాంకర్ (GOA CA), అన్వయ్ ద్రవిడ్ (WK) (KSCA), యువరాజ్ గోహిల్ (WK) (SCA), ఖిలన్ పటేల్ (GCA), కనిష్క్ చౌహాన్ (HCA), ఆయుష్ శుక్లా (MPCA), హెనిల్ పటేల్ (GCA), లక్ష్మణ్ పృథి (DDCA), రోహిత్ కుమార్ దాస్ (CAB), మోహిత్ ఉల్వా (SCA)
టీమ్ డి: చంద్రహాస్ డాష్ (C) (CAB), మౌల్యరాజ్‌సింగ్ చావ్డా (VC) (GCA), శంతను సింగ్ (UPCA), అర్నవ్ బుగ్గ (DDCA), అభినవ్ కన్నన్ (TNCA), కుషాగ్రా ఓజా (RCA), ఆర్యన్ సక్పాల్ (WK) (MCA), ఎ. రాపోల్ (WK) (HYCA), వికల్ప్ తివారి (CSCS), మొహమ్మద్ ఎనాన్ (KCA), అయాన్ అక్రమ్ (UPCA), ఉదవ్ మోహన్ (DDCA), అశుతోష్ మహిదా (BCA), M తోషిత్ యాదవ్ (ACA), సోలిబ్ తారిక్ (JKCA)
చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
