నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరుగబోయే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల ఇండియా-ఏ (India-A) జట్టును బీసీసీఐ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా వికెట్‌కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma) ఎంపిక కాగా.. నమన్ ధిర్ (Naman Dhir) అతనికి డిప్యూటీగా నియమితుడయ్యాడు.
ఈ జట్టులో చిచ్చరపిడుగులు, ఐపీఎల్ సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (Priyansh Ayra), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు జట్టు ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. మిడిలార్డర్ బ్యాటర్లుగా నేహల్ వధేరా, నమన్ ధిర్, సూర్యాంశ్ షేడ్గే, రమన్‌దీప్ సింగ్, అశుతోష్ శర్మ ఎంపికయ్యారు. అభిషేక్ పోరెల్ సెకెండ్ ఛాయిస్ వికెట్‌కీపర్, బ్యాటర్‌గా చోటు దక్కించుకున్నాడు.
పేసర్లుగా గుర్జప్నీత్ సింగ్, యశ్ ఠాకూర్, విజయ్ కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్ ఎంపిక కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సుయాశ్ శర్మ, హర్ష్ దూబే చోటు దక్కించుకున్నారు. స్టాండ్ బై ప్లేయర్లుగా గుర్నూర్ బ్రార్, కుమార్ కుషాగ్రా, తనుశ్ కోటియన్, సమీర్ రిజ్వి, షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. ఈ టోర్నీలో భారత-ఏ జట్టు.. ఒమన్, యూఏఈ, పాకిస్తాన్ ఏ జట్లతో పాటు గ్రూప్-బిలో ఉంది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (VC), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (C) (WK), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (WK), సుయాష్ శర్మ


