breaking news
ACC Cup Rising Stars 2025
-
పసికూనపై శ్రీలంక ప్రతాపం
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక-ఏ, హాంగ్‌కాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంగ్‌కాంగ్.. ట్రవీన్ మాథ్యూ (4-0-21-3), కెప్టెన్ దునిత్ వెల్లాలగే (3-0-24-2), విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-11-2), మిలన్ రత్నాయకే (3-0-19-1), గురక సంకేత్ (1-0-11-1), రమేశ్ మెండిస్ (4-0-18-0) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది.హాంగ్‌కాంగ్ ఇన్నింగ్స్‌లో శివ్ మథుర్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అన్షుమన్ రథ్ (21), కెప్టెన్ యాసిమ్ ముర్తుజా (20), ఎహసాన్ ఖాన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ఆడుతూపాడుతూ ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో (47 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంకను గెలిపించాడు. ఓపెనర్ నిషాన్ మధుష్క (35) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో విషెన్ హలంబగే 4, లసిత్ క్రూస్పుల్లే 13, సహాన్ అరఛ్చిగే 14 పరుగులు (నాటౌట్) చేశారు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో ముర్తుజా, నస్రుల్లా, అన్షుమన్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇవాళ రాత్రి 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.చదవండి: ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్ -
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా దేశవాలీ స్టార్
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్-ఏ జట్టును (Bangladesh-A) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా దేశవాలీ స్టార్, వికెట్‌కీపర్, బ్యాటర్ అయిన అక్బర్ అలీ (Akbar Ali) ఎంపికయ్యాడు.అక్బర్ అలీకి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 92 మ్యాచ్‌ల్లో 27.65 సగటున 1853 పరగులు చేశాడు. అతని తాజాగా ప్రదర్శనలు (40, 44, 28) కూడా పర్వాలేదనేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలైన రాజ్‌షాహీ, ఖుల్నా టైగర్స్ తరఫున కూడా అక్బర్ అలీ సత్తా చాటాడు.ఈ జట్టు అక్బర్‌తో పాటు అనుభవజ్ఞులు, యువశక్తి కలయికగా ఉంది. అబూ హీదర్ రోని, రిపోన్ మొండల్ బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరఫున సత్తా చాటారు. రోని 2016, మొండల్ 2023లో సీనియర్ టీమ్‌లోకి అరంగేట్రం చేశారు. యార్కర్ స్పెషలిస్ట్ అయిన రోని 13 టీ20ల్లో 6 వికెట్లు తీయగా.. మొండల్ 23 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఈ జట్టులో దేశవాలీ స్టార్లు,యువ ఆటగాళ్లు జిషన్ అలం, మహిదుల్ ఇస్లాం, అరిఫుల్ ఇస్లాం వంటి వారికి చోటు దక్కింది.ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంగ్‌కాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ, హాంగ్‌కాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుండగా.. భారత్-ఏ, పాకిస్తాన్-ఏ, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏ తలపడనున్నాయి.టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, ఒమన్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, యూఏఈ ఢీకొంటాయి. నవంబర్ 15న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ హాంగ్‌కాంగ్‌ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోకి మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు (A1 vs B2, B1 vs A2) చేరతాయి. ఈ మ్యాచ్‌లు నవంబర్ 21న జరుగుతాయి. సెమీస్ విజేతలు నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.బంగ్లాదేశ్ ఏ జట్టు..అక్బర్ అలీ (కెప్టెన్), జిషాన్ అలం, హబీబుర్ రెహమాన్, జవాద్ అబ్రార్, అరిఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ చౌదరి, మహిదుల్ ఇస్లాం భుయాన్, రకీబుల్ హసన్, ఎస్ఎం మెహెరోబ్ హుస్సేన్, అబూ హిడర్ రోనీ, తుఫాయెల్ అహ్మద్, షాధిన్ ఇస్లాం, రిపోన్ మొండోల్, అబ్దుల్ గఫార్ సక్లైన్, మృత్తుంజయ్ చౌదరిచదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరుగబోయే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల ఇండియా-ఏ (India-A) జట్టును బీసీసీఐ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా వికెట్‌కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma) ఎంపిక కాగా.. నమన్ ధిర్ (Naman Dhir) అతనికి డిప్యూటీగా నియమితుడయ్యాడు.ఈ జట్టులో చిచ్చరపిడుగులు, ఐపీఎల్ సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (Priyansh Ayra), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు జట్టు ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. మిడిలార్డర్ బ్యాటర్లుగా నేహల్ వధేరా, నమన్ ధిర్, సూర్యాంశ్ షేడ్గే, రమన్‌దీప్ సింగ్, అశుతోష్ శర్మ ఎంపికయ్యారు. అభిషేక్ పోరెల్ సెకెండ్ ఛాయిస్ వికెట్‌కీపర్, బ్యాటర్‌గా చోటు దక్కించుకున్నాడు. పేసర్లుగా గుర్జప్నీత్ సింగ్, యశ్ ఠాకూర్, విజయ్ కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్ ఎంపిక కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సుయాశ్ శర్మ, హర్ష్ దూబే చోటు దక్కించుకున్నారు. స్టాండ్ బై ప్లేయర్లుగా గుర్నూర్ బ్రార్, కుమార్ కుషాగ్రా, తనుశ్ కోటియన్, సమీర్ రిజ్వి, షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. ఈ టోర్నీలో భారత-ఏ జట్టు.. ఒమన్, యూఏఈ, పాకిస్తాన్ ఏ జట్లతో పాటు గ్రూప్-బిలో ఉంది.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (VC), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (C) (WK), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (WK), సుయాష్ శర్మ -
IND vs PAK T20: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆరోజే
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. దోహా, ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా పాల్గొననున్నాయి. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతోఒమన్, పాకిస్తాన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’లో పోటీ పడుతుండగా... అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనున్నాయి. గతంలో ఏసీసీ ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి ‘రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్’ పేరుతో నిర్వహించనున్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ‘ఎ’ జట్లు పాల్గొననుండగా... మిగిలిన మూడు అసోసియేట్ దేశాలైన హాంకాంగ్, ఒమాన్, యూఏఈ ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు. నవంబర్ 16నఇందులో భాగంగా నవంబర్ 16న దాయాది పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 21న సెమీఫైనల్స్ నిర్వహించనుండగా... నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. 2013 నుంచి ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభంలో అండర్–23 జట్లు పోటీపడగా... ఆ తర్వాత ‘ఎ’ జట్లకు మార్చారు. చివరిసారిగా 2024లోఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు విజేతగా నిలవగా... భారత్, అఫ్గానిస్తాన్ ఒక్కోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాయి. చివరిసారిగా 2024లో జరిగిన ఈ టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచింది. ఒమన్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై అఫ్గాన్ విజయం సాధించింది. చదవండి: పీఎకేల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ


