పసికూనపై శ్రీలంక ప్రతాపం | ACC Men's Asia Cup Rising Stars 2025, Sri Lanka Beat Hong Kong By 7 Wickets, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

పసికూనపై శ్రీలంక ప్రతాపం

Nov 17 2025 6:45 PM | Updated on Nov 17 2025 7:06 PM

ACC Men's Asia Cup Rising Stars 2025: Sri Lanka Beat Hong Kong By 7 Wickets

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్‌ 17) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక-ఏ, హాంగ​్‌కాంగ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంగ్‌కాంగ్‌.. ట్రవీన్‌ మాథ్యూ (4-0-21-3), కెప్టెన్‌ దునిత్‌ వెల్లాలగే (3-0-24-2), విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌ (4-0-11-2), మిలన్‌ రత్నాయకే (3-0-19-1), గురక సంకేత్‌ (1-0-11-1), రమేశ్‌ మెండిస్‌ (4-0-18-0) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది.

హాంగ్‌కాంగ్‌ ఇన్నింగ్స్‌లో శివ్‌ మథుర్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అన్షుమన్‌ రథ్‌ (21), కెప్టెన్‌ యాసిమ్‌ ముర్తుజా (20), ఎహసాన్‌ ఖాన్‌ (17 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ఆడుతూపాడుతూ ఛేదించింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ నువనిదు ఫెర్నాండో (47 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి శ్రీలంకను గెలిపించాడు. ఓపెనర్‌ నిషాన్‌ మధుష్క (35) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో రాణించాడు. 

మిగతా బ్యాటర్లలో విషెన్‌ హలంబగే 4, లసిత్‌ క్రూస్‌పుల్లే 13, సహాన్‌ అరఛ్చిగే 14 పరుగులు (నాటౌట్‌) చేశారు. హాంగ్‌కాంగ్‌ బౌలర్లలో ముర్తుజా, నస్రుల్లా, అన్షుమన్‌ తలో వికెట్‌ తీశారు. ఈ టోర్నీలో ఇవాళ రాత్రి 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది.

చదవండి: ఐపీఎల్‌-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్‌

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement