PC: BCCI/X
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డేలో కరేబియన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి, 41.4 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (110), విరాట్ కోహ్లి (139) భారీ సెంచరీలతో విరుచుకుపడగా.. రోహిత్ శర్మ (32) పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మకు మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్‌తో హిట్ మ్యాన్ ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్
వన్డేల్లో ఓపెనర్‌గా తొలి 200 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 'క్రికెట్ దేవుడు' సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్-టైమ్ రికార్డును రోహిత్ తిరగరాశాడు.
రోహిత్ శర్మ 200 ఇన్నింగ్స్‌ల్లో 9,897 పరుగులు చేయగా.. సచిన్ 9,217 రన్స్ చేశాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ (11,927 పరుగులు) ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
వన్డేల్లో ఓపెనర్‌గా తొలి 200 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే
రోహిత్ శర్మ – 9,897 పరుగులు*
సచిన్ టెండూల్కర్ – 9,217 పరుగులు
సౌరవ్ గంగూలీ – 7,870 పరుగులు
క్రిస్ గేల్ – 7,669 పరుగులు
సయీద్ అన్వర్ – 7,564 పరుగులు
డెస్మండ్ హేన్స్ – 7,454 పరుగులు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 7,147 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ – 7,051 పరుగులు
తమీమ్ ఇక్బాల్ – 6,871 పరుగులు
సనత్ జయసూర్య – 6,727 పరుగులు


