PC: BCCI/Wpl
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ విధ్వంసకర బ్యాటర్ గ్రేస్ హారిస్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.
ఈ ఏడాది ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో హారిస్ కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆమెను ఫ్రాంచైజీ వదులుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రాబోయే వేలంలో ఆమెను బెంగళూరు మళ్లీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు.
హారిస్‌తో పాటు లిన్సీ స్మిత్, డి. హేమలత, గౌతమి నాయక్‌లను కూడా ఆర్సీబీ జట్టు నుంచి విడుదల చేసింది. ఇక వ్యక్తిగత కారణాల వల్ల గత సీజన్‌కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీని ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఆమెతో పాటు విదేశీ ప్లేయర్ల కోటాలో లారెన్ బెల్, నాడిన్ డి క్లెర్క్, జార్జియా వోల్‌లను జట్టులోనే కొనసాగించింది.
మరోవైపు యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ అత్యధికంగా తొమ్మిది మంది ఆటగాళ్లను విడిచిపెట్టింది. వారిలో డియాండ్రా డాటిన్, అమీ జోన్స్ వంటి కీలక ప్లేయర్లు ఉండడం గమనార్హం. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా అలనా కింగ్, లిజెల్ లీ వంటి స్టార్ ప్లేయర్లను వేలానికి ముందు రిలీజ్ చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్
విడిచిపెట్టిన ప్లేయర్లు: అలనా కింగ్, లిజెల్ లీ, స్నేహ రానా, తానియా భాటియా, ప్రగతి సింగ్, ఎడ్ల సృజన
రిటైన్ ప్లేయర్లు: అనాబెల్ సదర్లాండ్, చినెల్లే హెన్రీ, లారా వోల్వార్డ్ట్, లూసీ హామిల్టన్, మారిజానే కాప్, డీయా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్, మమతా మడివాలా, మిన్ను మణి, ఎన్ శ్రీ చరణి, నందనీ శర్మ, నికి ప్రసాద్, షఫాలీ వర్మ
గుజరాత్ జెయింట్స్
విడిచిపెట్టిన ప్లేయర్లు: : డాని వ్యాట్-హాడ్జ్, ఆయుషి సోని, టిటాస్ సాధు, శివాని సింగ్
నిలబెట్టుకున్న ప్లేయర్లు: ఆష్లీగ్ గార్డనర్, బెత్ మూనీ, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, సోఫీ డివైన్, అనుష్క శర్మ, భారతీ ఫుల్‌మాలి, హ్యాపీ కుమారి, జింతిమణి కలితా, కనికా అహుజా, కష్వీ గౌతమ్, రాజేశ్వరి గయాక్‌వాడ్, రేణుకా సింగ్, తనుజా భత్ కల్వర్, తనుజా భత్ కల్వార్,
ముంబై ఇండియన్స్
విడిచిపెట్టిన ప్లేయర్లు: మిల్లీ ఇల్లింగ్‌వర్త్, జి కమలిని, క్రాంతి రెడ్డి, పూనమ్ ఖేమ్నార్, సైకా ఇషాక్, త్రివేణి వశిష్ట
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: మెలీ కెర్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, నికోలా కారీ, అమంజోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్, రహిలా ఫిర్దౌస్, ఎస్ సజన, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, వైష్ణవి శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రిలీజ్ చేసిన ప్లేయర్లు: గ్రేస్ హారిస్, లిన్సే స్మిత్, డి హేమలత, గౌతమి నాయక్
నిలబెట్టుకున్న ప్లేయర్లు: ఎల్లీస్ పెర్రీ, జార్జియా వోల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, ప్రత్యూష కుమార్, ప్రేమ రావత్, రాధా యాదవ్, రిచా ఘోష్, సయాలీ సత్‌ఘరే, శ్రేయంక పాటిల్, స్మృతి మంధాన


