ఓపెన్ ఏఐతో సచిన్ భాగస్వామ్యం | Sachin Tendulkar Partners with OpenAI why Legend Enters AI Revolution | Sakshi
Sakshi News home page

ఓపెన్ ఏఐతో సచిన్ భాగస్వామ్యం

Sep 29 2026 11:28 AM | Updated on Sep 29 2026 11:51 AM

Sachin Tendulkar Partners with OpenAI why Legend Enters AI Revolution

క్రికెట్‌ క్రీడలో ఎన్నో రికార్డులు తిరగరాసిన భారత క్రికెట్ దిగ్గజం, ‘భారతరత్న’ సచిన్ తెందుల్కర్‌ సాంకేతిక పరిజ్ఞానంలోనూ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’తో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. చాట్‌జీపీటీ సామర్థ్యాన్ని, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.

సాంకేతికతను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా ఓపెన్ ఏఐ ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి సచిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో చాట్‌జీపీటీ సచిన్‌ను గుర్తించడానికి పది ప్రశ్నలు అడగడం, చివరికి చాట్‌జీపీటీ సచిన్‌ను సరిగ్గా గుర్తించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సచిన్ మాటల్లో చాట్‌జీపీటీ వినియోగం

చాట్‌జీపీటీ తన రోజువారీ జీవితంలో ఏ విధంగా సహాయపడుతుందో సచిన్ వివరించారు. ‘నాకు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. ఒక ప్రశ్న ఆలోచిస్తే మరో ప్రశ్న పుట్టుకొస్తుంది. ఈ అలవాటును ప్రోత్సహించడంలో చాట్‌జీపీటీ నాకు ఎంతగానో ఉపయోగపడింది’ అని సచిన్ పేర్కొన్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ప్రణాళికను రూపొందించడంలోనూ చాట్‌జీపీటీ ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు.

భారత్‌లో ఓపెన్ ఏఐ విస్తరణ

ఇటీవలే బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సచిన్ తెందుల్కర్‌తో చేతులు కలపడం ద్వారా భారత మార్కెట్‌లో డిజిటల్ పరిజ్ఞానాన్ని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేపడుతోంది. ఏఐ సాంకేతికతను కేవలం సాంకేతిక నిపుణులకే కాకుండా ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమస్యల పరిష్కారానికి సాధనంగా ఉపయోగించుకోవాలని సచిన్ కోరారు. ఈ భాగస్వామ్య పరిణామాలను క్రీడా, సాంకేతిక వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement