‘నేను తప్పు చేశా..’ స్నేహితుడితో సాహిల్ చివరి మాటలు! | Caught Using This in Exam: IIT Bombay Student Sahil Wakode Case Update | Sakshi
Sakshi News home page

‘నేను తప్పు చేశా..’ స్నేహితుడితో సాహిల్ చివరి మాటలు!

Sep 28 2026 6:30 PM | Updated on Sep 28 2026 6:46 PM

Caught Using This in Exam: IIT Bombay Student Sahil Wakode Case Update

ముంబై: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వకోడే ఆత్మహత్య వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల్లో చీటింగ్‌ చేసినట్లు సాహిల్‌ తనకు చెప్పినట్లు ఓ విద్యార్థి పోలీసులకు వాంగ్మూలం (స్టేట్‌మెంట్) ఇచ్చాడు. 

ఇటీవల ఐఐటీ బాంబేలో నిర్వహించిన పరీక్షల్లో సాహిల్ చీటింగ్‌ చేస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, సాహిల్ ఆత్మహత్యకు కేవలం చాట్‌జీపీటీని వినియోగించడం మాత్రమే కారణం కాదని, కులం పేరుతో గత కొన్ని నెలలుగా అతన్ని వేధించడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని వారు చెబుతున్నారు.

ఈ క్రమంలో విద్యార్థి మరణంపై పోలీసులు ఇప్పటివరకు సుమారు 20 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించారు. సాహిల్ పరీక్ష రాసే సమయంలో గదిలో ఉన్న విద్యార్థులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన సిబ్బంది, అలాగే అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ముందు సాహిల్‌తో చివరిసారిగా మాట్లాడిన తోటి విద్యార్థి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సదరు విద్యార్థి తన స్టేట్‌మెంట్‌లో, ‘ఆత్మహత్యకు ముందు సాహిల్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఐఐటీ బాంబే నిర్వహించిన థర్మోడైనమిక్స్ పరీక్షను తాను అనుకున్నట్లుగా రాయలేకపోయానని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పరీక్షలో తాను చీటింగ్ చేస్తూ దొరికిపోయినట్లు కూడా నాతో చెప్పాడు’ అని వెల్లడించాడు. పోలీసులు సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా సాహిల్ మరణానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.

అలాగే, సాహిల్ ఫోన్ రికార్డులను, స్నేహితులతో జరిపిన సంభాషణలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్‌కు  ప్యాట్రన్‌ లాక్ ఉండటంతో, దానిని అన్‌లాక్ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ స్క్రీన్‌పై అనేక మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌లు కనిపించినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయానికి సంబంధించిన కాలక్రమాన్ని (క్రోనాలజీ) కచ్చితంగా నిర్ధారించే ప్రయత్నంలో భాగంగా దర్యాప్తు అధికారులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement