నవరాత్రి...వైరల్‌ ట్రెండ్‌ | AI photo editing prompts for ChatGPT, Gemini to turn your photos into Garba | Sakshi
Sakshi News home page

నవరాత్రి...వైరల్‌ ట్రెండ్‌

Oct 17 2026 1:04 AM | Updated on Oct 17 2026 1:04 AM

AI photo editing prompts for ChatGPT, Gemini to turn your photos into Garba

తమ ఫొటోలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్‌ చేయడానికి సాధారణ కెమెరా ఫిల్టర్‌లకు బదులుగా గూగుల్‌ జెమిని, చాట్‌జీపీటిలాంటి ఏఐ ఇమేజ్‌ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు యూజర్‌లు.  నవరాత్రి ఉత్సవకళ ఉట్టి పడేలా తమ ఫొటోలను తీర్చిదిద్దుకుంటున్నారు.

మన ప్రాంప్ట్‌తో...‘ఆహా!’ అనిపించి సినిమాటిక్‌ ఫొటోగ్రాఫ్‌ను గుర్తు చేస్తాయి ఏఐ టూల్స్‌. ‘నవరాత్రి ఇమేజ్‌ను క్రియేట్‌ చేయండి’ అనే ఒకే ఒక ప్రాంప్ట్‌ ఇస్తే సరిపోదు. మీకు ఇష్టమైన దుస్తులు, ఆభరణాలు, లైటింగ్, భంగిమ, నేపథ్యం... మీరు కోరుకునే ఫొటో గురించి వివరించండి. రిఫరెన్స్‌ ఫొటో అప్‌లోడ్‌ చేసి దాన్ని ఎడిట్‌ చేయమని టూల్‌ని అడగవచ్చు. పండగ కళ ఉట్టి పడే కొత్త ఫొటోను సృష్టించవచ్చు.

కొన్ని ప్రాంప్ట్‌లు
→ ట్రాన్స్‌ఫామ్‌ మై రిఫరెన్స్‌ ఫొటో ఇన్‌ టూ ఏ సినిమాటిక్‌ నవరాత్రి నైట్‌ పోర్ట్రయిట్‌.
→ డ్రెస్‌ మీ ఇన్‌ యాన్‌ ఎలిగెంట్‌ ఎంబ్రాయిడర్డ్‌ లెహంగా విత్‌ ట్రెడిషనల్‌ జువెలరీ
→ క్రియేట్‌ ఏ వైబ్రెంట్, ఫొటోరియలిస్టిక్‌ ఫొటోగ్రాఫ్‌ ఆఫ్‌ మీ ఎంజాయింగ్‌ ఏ గర్భా నైట్, హోల్డింగ్‌ డెకోరేట్‌ దాండియా స్టిక్స్‌.
→  ...ఈ ప్రాంప్ట్‌లను ఉపయోగించడానికి గూగుల్‌ జెమినీ, చాట్‌జీపీటి ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌ని ఒపెన్‌ చేయాలి. మీ ఫొటోను అప్‌లోడ్‌ చేసి, ప్రాంప్ట్‌ పేస్ట్‌ చేయాలి.
→ క్యాండిడ్‌ ఫొటోగ్రాఫీ, సినిమాటిక్‌ పోర్ట్రాయిట్, ఫ్యాషన్‌ ఎడిటోరియల్, సాఫ్ట్‌ గోల్డెన్‌–హవర్‌ లైటింగ్‌...మొదలైన ఫొటోగ్రఫీ స్టైల్స్‌ను ఎంచుకోవచ్చు.
→ ఇమేజ్‌లో టూమచ్‌ చేంజెస్‌ కనిపిస్తే... రివిజన్‌ కోసం అడగవచ్చు. తద్వారా ఫేషియల్‌ ఫీచర్‌లు, ఎక్స్‌ప్రేషన్, స్కిన్‌ టెక్చర్‌...మొదలైనవి సహజంగా కనిపించేలా చేయవచ్చు.

కోర్‌ ట్రెండ్స్‌– 9 డివైన్‌ లుక్స్‌ ఛాలెంజ్‌
→ ఏఐ టూల్స్‌ను ఉపయోగించి సాధారణ సెల్ఫీలను నవ రాత్రుల కళతో తీర్చిదిద్దుతున్నారు నెటిజనులు. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు నవరాత్రులలో ప్రతి రాత్రిని నిర్దిష్టమైన కలర్‌ కోడ్స్, థీమ్స్‌ జోడిస్తున్నారు.

వర్చువల్‌ గర్భా నైట్‌ పోర్ట్రాయిట్స్‌
→ అద్దాల కళతో మెరిసే చనియా చోళీలు లేదా ధోవతులు, సినిమాటిక్‌ లైటింగ్, నియాన్‌ లైట్‌లతో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌లను వివరిస్తూ చాట్‌బాట్‌లకు ప్రాంప్ట్స్‌ ఇవ్వడం ద్వారా ప్రొఫెషనల్‌ ఫొటోషూట్‌లు బుక్‌ చేసుకోకుండానే అద్భుతమైన గర్భా, దాండియా నైట్‌ పోర్ట్రయిట్‌లను రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement