మరో వాష్‌ ఔట్‌.. సెమీస్‌కు బంగ్లాదేశ్‌ | Bangladesh advance to Asian Games semifinals after washout | Sakshi
Sakshi News home page

మరో వాష్‌ ఔట్‌.. సెమీస్‌కు బంగ్లాదేశ్‌

Sep 29 2026 9:34 AM | Updated on Sep 29 2026 10:33 AM

Bangladesh advance to Asian Games semifinals after washout

source: X

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో మరో కీలక మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బంగ్లాదేశ్‌-మలేషియా జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం​ కారణంగా టాస్‌ కూడా పడకుండానే వాష్‌ ఔట్‌ అయ్యింది. మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా బంగ్లాదేశ్‌ సెమీస్‌కు చేరింది. అక్టోబర్‌ 1న జరిగే తొలి సెమీస్‌లో ఆ జట్టు పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.

దీనికి ముందు శ్రీలంక-నేపాల్‌ మధ్య జరగాల్సిన మూడో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం​ కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. ఈ రెండు జట్లలో మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా శ్రీలంక సెమీస్‌కు చేరింది. అక్టోబర్‌ 1నే రెండో సెమీస్‌లో శ్రీలంక భారత్‌తో తలపడుతుంది.

కాగా, ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల క్రికెట్‌ ఈవెంట్‌లో మొత్తం నాలుగు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు వర్షాల కారణంగా రద్దయ్యాయి. దీంతో మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సెమీస్‌కు చేరాయి. ఈ నాలుగు జట్లు ర్యాంకింగ్‌ ఆధారంగానే నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక్కడ వరుణుడు అడ్డుపడటంతో చిన్న జట్లు ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌, మలేషియా, హాంగ్‌కాంగ్‌ చైనా కనీసం​ బరిలోకి దిగకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఇదీ చదవండి: Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement