ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు | Student Of The Year Movie Trailer Launch By Sukumar | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు

Oct 11 2019 1:22 AM | Updated on Oct 11 2019 1:22 AM

Student Of The Year Movie Trailer Launch By Sukumar - Sakshi

ఓబుల్‌ సుబారెడ్డి, సుకుమార్, శ్రీనాథ్‌ మాగంటి, కుమార్‌

‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోస్టర్, ట్రైలర్‌ బాగున్నాయి. ‘1 నేనొక్కడినే, 100%లవ్‌’ చిత్రాలకు కథ అందించిన హరి ప్రసాద్‌ ఈ సినిమాకు స్టోరీ అందించారంటే కథ ఎలా ఉంటుందో తెలుస్తోంది’’ అన్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. సంజయ్‌ ఇదామ, శ్రీనాధ్‌ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’. రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్‌ విడుదల చేశారు.

బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి సందేశం ఉన్న కథతో తీశాం. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశాననే సంతృప్తి ఉంది’’ అన్నారు.  ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మా సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.కిషోర్, కెమెరా: సునీల్‌ కుమార్‌.ఎ¯Œ .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement