
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నేడు దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. పండగ పూట హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా పంపించాడు నాగ్. అలాగే వారి ఫ్యామిలీస్‌తో వీడియో కాల్ మాట్లాడించాడు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. భర్త, ఇద్దరు పిల్లల్ని చూడగానే సంజనా కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఎమోషనల్‌గా దీపావళి స్పెషల్ ఎపిసోడ్
అటు డిమాన్ పవన్, సుమన్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు నెలన్నర తర్వాత ఇంట్లోవాళ్లను స్క్రీన్‌పై చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కుర్తాపైజామాలో ఉన్న నాగార్జునను చూసి సంజనా ఓ డైలాగ్ వేసింది. పెళ్లిచూపులకు రెడీ అయినట్లుగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు నాగ్.. ఏంటి? నీకు, నాకా? అని సరదాగా అన్నాడు. అది విని హౌస్‌మేట్స్ ఆశ్చర్యపోయారు. ఈ దీపావళి ఎపిసోడ్ నేడు రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.
చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్