రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ కల్యాణ్‌ వార్నింగ్‌ | Bigg Boss 9 Telugu Nov 11th Episode Highlights, Rithu Chowdary And Pawan Kalyan Padala Sanchalak In BB Kingdom Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 9: సుమన్‌ కోసం తనూజ గొడవ.. వార్నింగ్‌ ఇచ్చిన కల్యాణ్‌..

Nov 12 2025 9:31 AM | Updated on Nov 12 2025 11:12 AM

Bigg Boss 9 Telugu: Rithu Chowdary, Pawan Kalyan Padala Sanchalak in BB Kingdom

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యంలో కల్యాణ్‌ రాజయితే, దివ్య, రీతూ మహారాణులు. వీళ్లు నలుగురు కమాండర్లను సెలక్ట్‌ చేసుకుంటే మిగతావాళ్లు ప్రజలుగా ఉంటారు. మరి ఎవర్ని కమాండర్లుగా తీసుకున్నారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో మంగళవారం (నవంబర్‌ 11వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

వాళ్లదే రాజ్యం
బీబీ రాజ్యంలో బిగ్‌బాస్‌కు బుద్ధి పుట్టినప్పుడల్లా గేమ్స్‌ పెడుతూ ఉంటాడు. వారం ముగిసేసరికి రాజు, రాణులు, కమాండర్స్‌, ప్రజలు.. వీరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్స్‌ నుంచి సేవ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. మొదటగా మహారాజు, రాణులతో చర్చించి తనూజ, సంజనా, పవన్‌, నిఖిల్‌ను కమాండర్లుగా ఎంచుకున్నారు. మిగిలిన భరణి, ఇమ్మాన్యుయేల్‌, సుమన్‌, గౌరవ్‌ ప్రజలుగా మిగిలిపోయారు. ఈ ప్రజలే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

రీతూ తొండాట
మహారాణిగా ఆసీనురాలైన దివ్య.. దొరికిందే ఛాన్స్‌ అన్నట్లుగా భరణితో తలకు మసాజ్‌ చేయించుకుంది. తర్వాత కమాండర్స్‌కు ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌కు రీతూ (Rithu Chowdary) సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే తను గతంలో చేసిన తప్పే మళ్లీ చేసింది. పవన్‌ ఔట్‌ అయినా సరే, కాలేదంటూ అతడిని గేమ్‌ ఆడించింది. ఈ క్రమంలో సంజనా, తనూజ.. రీతూపై ఎగబడ్డారు. అయినా ఆమె అస్సలు లెక్కచేయలేదు. చివరకు ఈ గేమ్‌లో సంజనా ఓడిపోయింది.

కష్టపడ్డ సుమన్‌
కమాండర్స్‌ నలుగురిలో ఓడిపోయిన సంజనా (Sanjana Galrani) తన పోస్టు కాపాడుకోవాలంటే ప్రజల్లో ఒకరితో తలపడి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమన్‌ను ఎంచుకుంది. ఈ ఇద్దరికీ కాటన్‌ డబ్బాలతో టవర్‌ కట్టే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. సుమన్‌కు మరీ ఎక్కువ ఎత్తులో డబ్బాలు పెట్టడమనేది తన హైట్‌కు కష్టమైన విషయమే! అయినప్పటికీ సంజనాకు గట్టి పోటీనిస్తూ బాక్స్‌ మీద బాక్స్‌ ఎగరేసి మరీ నిలబెట్టాడు. బజర్‌ మోగే సమయానికి సంజన-సుమన్‌ ఇద్దరి టవర్‌ ఒకే ఎత్తులో ఉంది. కాకపోతే సంజనా టవర్‌ నిటారుగా, పర్ఫెక్ట్‌గా ఉంది కనుక తనే గెలిచింది అని కల్యాణ్‌ ప్రకటించాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు.

కల్యాణ్‌ను తిట్టిపోసిన తనూజ
టవర్‌ ఎలా ఉన్నా పర్లేదన్నారు కదా.. చివరి బాక్స్‌ సుమనే ముందు పెట్టాడుగా అని తనూజ, దివ్యలు నోరేసుకుని పడిపోయారు. అయినప్పటికీ కల్యాణ్‌ తన నిర్ణయంపై నిలబడి ఉన్నాడు. అప్పటికీ తనూజ ఒప్పుకోలేదు. ఇదంతా నువ్వు ముందు చెప్పాల్సింది. నచ్చినట్లు చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తానంటే ఎలా కుదురుతుంది? చెప్పిన మాట మీద లేవు.. గేమ్‌ స్టార్ట్‌ అయ్యేముందు ఒకటి చెప్పావ్‌, అయిపోయాక ఒకటి చెప్తున్నావ్‌.. సంచాలక్‌గా ఫెయిల్‌ అని అరించింది. ఆ మాటతో ఆగ్రహించిన కల్యాణ్‌.. నోటికొచ్చినట్లు వాగితే బాగోదంటూ బాక్సుల్ని ఒక్కదెబ్బతో గుద్ది పడేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.

చదవండి: నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement