నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ | Konda Surekha Again Comments On Nagarjuna akkineni Family | Sakshi
Sakshi News home page

నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ

Nov 12 2025 7:10 AM | Updated on Nov 12 2025 10:26 AM

Konda Surekha Again Comments On Nagarjuna akkineni Family

సినీ నటుడు నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సోషల్‌మీడియా ద్వారా మరోసారి స్పందించారు. 'నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని  స్పష్టంగా తెలుపుతున్నాను. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా పరువు తీయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే దానికి  చింతిస్తున్నాను. ఆపై ఆ వాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.' అని మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్‌ చేశారు.

కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసిన సందర్భంలో  నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టిన నాగార్జున సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement