తప్పు చేసి సారీ చెప్తే ఎలా.. బిగ్‌బాస్‌లో భరణి ఫైర్‌ | Bigg Boss Telugu 9: Bharani and Sreshta Varma Return; Nominations Turn Heated | Sakshi
Sakshi News home page

తప్పు చేసి సారీ చెప్తే ఎలా.. బిగ్‌బాస్‌లో భరణి ఫైర్‌

Oct 28 2025 11:35 AM | Updated on Oct 28 2025 12:00 PM

Bharani shankar and sanjana galrani bigg fight in bigg boss 9 telugu

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ ఒక్కోక్కరిగా వచ్చి హౌస్‌లో ఉండే సభ్యులను నామినేట్‌ చేస్తున్నారు. ఇప్పటికే  ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ తమ ప్రక్రియను సోమవారం ఎపిసోడ్‌లో ముగించారు. అయితే, మంగళవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. భరణితో పాటు శ్రేష్టి వర్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

భరణి ఎంట్రీ ఇవ్వగానే దివ్య చాలా సంతోషంగా వెళ్లి హగ్‌ చేసుకుని తన అభిమానాన్ని చూపింది. ఇంతలో ఇమ్మాన్యేయల్ దగ్గరికి వెళ్లిన భరణి.. కట్టప్ప చంపేశావ్‌ కదరా అంటూ సరదాగా పలకరిస్తాడు. అయితే, ఫైనల్‌గా సంజనాను భరణి నామినేట్‌ చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. 'భరణి అన్నయ్య అంటూ  నువ్వు పిలిచిన ప్రతిసారి ఒక సిస్టర్‌గానే నేను చూశాను. ఏరోజు కూడా ఫేక్‌ రిలేషన్‌ కొనసాగించలేదు. తప్పు చేసి సారీ అని చెప్పితే సరిపోతుందా.. 'అంటూ సంజనపై భరణి ఫైర్‌ అవుతారు. అయితే, దివ్యను రోడ్‌ రోలర్‌ అని కామెంట్‌ చేయడం వల్లనే భరణి ఫైర్‌ అయ్యారని తెలుస్తోంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన ఫైట్‌ ఈ మంగళవారం ఎపిసోడ్‌లో హైలైట్‌ కానుంది.

శ్రేష్టి వర్మ కూడా సరైన పాయింట్లతోనే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్‌ ఆటపై అభ్యంతరం తెలిపింది. రీతూ ట్రాప్‌లోనే ఉన్నావ్‌ అంటూ చెప్పింది. గేమ్‌ పట్ల రీతూకు ఉన్న క్లారిటీ కూడా లేదంటూ పవన్‌ను శ్రేష్టి నామినేట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement