
బిగ్‌బాస్ షో లాంచ్ అయి రెండు రోజులు అయింది. ఇంకా నామినేషన్స్ మొదలు కాలేదేంటా అని అనుకుంటుండగానే ఆ ప్రోమో రిలీజైంది. నిన్నటివరకు అంతా ఒక్కటి అనుకున్నోళ్లు కాస్త ఇప్పుడు వేరు అయిపోయారు. ఒక్కొక్కరు కారణాలు చెబుతూ తోటి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేశారు. ఈ వారం లిస్టులో ఎవరెవరు ఉన్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.
అగ్నిపరీక్షలో గెలిచి వచ్చిన సామాన్యులు ప్రస్తుతం హౌసులో ఓనర్స్‌గా చెలామణి అవుతున్నారు. సెలబ్రిటీలు టెనెంట్స్‌గా ఉన్నారు. ప్రతిసారిలా ఈసారి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున చేయడం లాంటివి ఈసారి లేవు. బిగ్‌బాస్ చెప్పిన ప్రతిసారి సామాన్యులంతా కలిసి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. అలానే సెలబ్రిటీలు కూడా తమలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో తొలుత హౌసులో అందరికీ ఎదురు సమాధానం చెబుతున్న సంజనని నామినేట్ చేశారు.
(ఇదీ చదవండి: రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ)
అలానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాము రాథోడ్.. శ్రష్ఠి వర్మని, భరణి.. సంజనని, హరీశ్.. సుమన్ శెట్టిని ఇలా మొత్తంగా సెలబ్రిటీలంతా నామినేషన్లలో నిలిచారు. అయితే లిస్టులో ఒక్కరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో భరణి సేవ్ అయ్యారు. ఈయన ప్లేసులో సామాన్యుల నుంచి డీమన్ పవన్.. నామినేషన్లలో నిలిచాడు.
ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. మరి వీళ్లలో తొలివారం ఎవరు బయటకెళ్లిపోతారనేది చూడాలి?
(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)