
కన్నడ స్టార్ హీరో దర్శన్.. జడ్జి ముందు బోరున విలపించాడు. తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హతమార్చిన కేసులో జైల్లో ఉన్న దర్శన్.. నెలవారీ హియరింగ్‌లో భాగంగా మంగళవారం జైలు నుంచే వీడియో కాల్ ద్వారా కోర్ట్ హియరింగ్‌లో పాల్గొన్నాడు. జైల్లో అస్సలు ఉండలేకపోతున్నానని, తన జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు.
'నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. 'అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.
(ఇదీ చదవండి: మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్)
గతేడాది తన అభిమాని రేణుకస్వామిని.. హీరో దర్శన్ హత్య చేశాడు. తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు సదరు రేణుకస్వామి అసభ్యకర మెసేజులు పంపుతుండటమే దీనికి కారణం. తొలుత అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్.. బెంగళూరులోని ఓ షెడ్‌లో పెట్టి చిత్రహింసలు చేశాడు. తర్వాత రేణుకస్వామి బాడీ.. దగ్గరలోని ఓ నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ తదితరుల్ని గతేడాది జూన్‌లో అరెస్ట్ చేశారు.
అయితే కొన్ని నెలల పాటు దర్శన్ జైల్లో ఉన్నాడు. గతేడాది డిసెంబరులో కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చాడు. కానీ సుప్రీం కోర్ట్ ఆ బెయిల్‌ని రద్దు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్.. బయట ఉంటే సాక్ష‍్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ దర్శన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా తనకు జైలులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని బోరున ఏడ్చేశాడు. కనీసం తలగడ, బెడ్ షీట్స్, ఇంటిలో తయారు చేసిన ఆహారం లాంటివి అయినా సరే అనుమతించాలని దర్శన్.. జడ్జిని కోరాడు.
(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్)