
మంచు ఫ్యామిలీ నుంచి రీసెంట్‌గా వచ్చిన సినిమా 'కన్నప్ప'. చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేసినా సరే మంచు విష్ణుకి పెద్దగా కలిసిరాలేదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ కావడంతో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరుల్ని ఒప్పించిన విష్ణు.. ఈ చిత్రంలో వీళ్లతో అతిథి పాత్రలు చేయించాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. ఇప్పుడు మంచు కుటుంబం నుంచి మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది.
(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్)
మంచు లక్ష‍్మీ లేటెస్ట్ మూవీ 'దక్ష'. మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ పాత్రలో మంచు లక్ష‍్మీ కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని అల్లు అర్జున్ లాంచ్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే చాన్నాళ్ల క్రితం తీసిన మూవీలా అనిపిస్తుంది. అలానే మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తీసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ థియేటర్లలో విడుదల ఎప్పుడు ఏంటనేది మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు మంచు మనోజ్.. కొన్నాళ్ల క్రితం 'భైరవం'తో చాన్నాళ్ల తర్వాత నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇతడు విలన్‌గా చేసిన 'మిరాయ్' అనే సూపర్ హీరో మూవీ రిలీజ్‌కి సిద్ధమైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం.. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)