Daksha Movie
-
మంచు లక్ష్మి నిర్మాతగా సైకలాజికల్ థ్రిల్లర్.. మోహన్ బాబు లుక్ రివీల్
టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో మరో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. దక్ష అనే మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.ఈ సినిమాను మంచు ఎంటర్ టైన్మెంట్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.Happy Birthday Dear Legend! Back with another banger, #Daksha The Deadly Conspiracy. Proud to be a producer alongside you. 🧿❤️ pic.twitter.com/AV09pC3wLs— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 19, 2025 -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్!
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘దక్ష’(Daksha). శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023లో థియేటర్లలో విడుదలై ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బిసినీట్ (Bcineet OTT)తో పాటు హంగామా(Hungama OTT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటు యూట్యూబ్‌లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ & యాక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, ‘మాకు థియేటర్లో మంచి స్పందన లభించినట్లుగానే, ఇప్పుడు విడుదలైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'దక్ష' తప్పకుండా నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. నిర్మాతలకు సహాయపడేలా ప్రతి రూపాయి విలువైనదని భావిస్తున్నాము. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ నమోదుచేశారు’ అని తెలిపారు.దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ..‘మంచి కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్ఫుల్ విజువల్స్ మా సినిమాకి ప్రధాన బలాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని తెలిపారు. -
Daksha: ఆ గేమ్ ఆడితే చాలు ప్రాణాలు పోతాయి.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ట్రైలర్
ప్రముఖ నటుడు శరత్ బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐరా అను, నక్షత్ర, అలేఖ్య, రవిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. కొంతమంది యువతీయవకులు వినోదం కోసం సరదాగా ఓ స్కేరీ గేమ్ ఆడడం.. ఆ గేమ్ ఆడిన వారందరూ ఒక్కొక్కరుగా మృతి చెందడం లాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలతో సాగే ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. అసలు ఆ గేమ్ ఆడిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? వాళ్లను హత్య చేసేదెవరు? ఆ గేమ్‌కు వరస హత్యలకు ఉన్న సంబంధం ఏంటి తదితర విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 25న థియేటర్లో దక్ష సినిమా చూడాల్సిందే. -
మెగాహీరోకి పోటీగా శరత్ బాబు వారసుడు
కొన్నాళ్ల క్రితం (మే 22) కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్‌బాబు ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు. శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. కాగా గతంలో ఆయుష్‌ని తన నటవారసుడిగా శరత్‌బాబు పేర్కొన్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ‘దక్ష’ ఈ నెల 25న విడుదల కానుంది. ఇదే రోజున మెగా హీరో వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' థియేటర్లలోకి రానుంది. ‘‘మా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మా ప్రోడ్యూసర్, డైరెక్టర్ రాజీ పడకుండా పూర్తి చేశారు. మా నాన్న (శరత్‌బాబు)గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం’’ అన్నారు ఆయుష్. అఖిల్, రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రానికి సంగీతం: లలిత్. -
దక్షత కలిగిన సినిమా ‘దక్ష’: తనికెళ్ళ భరణి
‘దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం‘ అలాంటి దక్షతతో కూడిన కథనంతో తెరపైకి రాబోతున్న దక్ష చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని ప్రముఖ టాలివుడ్ నటుడు తనికెళ్ళ భరణి తెలిపారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ దక్ష‘. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను ఫిల్మ్ ఛాంబర్లో తనికెళ్ళ భరణి, శరత్ బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ తల్లాడ సాయి కృష్ణ చిన్న స్థాయి నుంచి స్వశక్తితో వ్యక్తి అని,. గతంలో వ్యవసాయం కథాంశంగా తను దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్‌కు నేషనల్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. తన నిర్మాణంలో రూపొందుతున్న దక్ష చిత్రంతో తన మిత్రుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా పరిచయం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. శరత్ బాబు మంచి మిత్రుడే కాకుండా ఇద్దరం కలిసి పలు చిత్రాల్లో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. ‘ఆయుష్ తన తమ్ముడి కొడుకైనప్పటికీ నా దగ్గరే పెరిగాడని, తన తనయుడిగా ఇండస్ట్రీకి రావడం ఆనందంగా ఉందని శరత్ బాబు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతకు ఆర్థికంగా, టెక్నీషియన్స్‌కు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుందన్నారు. వినూత్న కథాంశంతో వస్తున్నాం.. ‘దర్శకుడిగా నా మెదటి చిత్రాన్ని వినూత్నమైన కథతో, ఆసక్తికరమైన సన్నివేశాతో రూపొందించానని దర్శకుడు వివేకానంద విక్రాంత్ తెలిపారు. మంచి కథతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో దక్ష స్థానం సంపాదించుకుంటుందని అన్నారు. హీరో ఆయుష్ మాట్లాడుతూ ‘హీరో అవ్వాలనేది నా డ్రీమ్. ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేశాను. మేమంతా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. థ్రిల్లర్ కథాంశంతో హైదరాబాద్, అరకు, ఖమ్మం తదితర అదర్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అను, నక్షత్ర, క్లాసిక్ గ్రూప్ చైర్మెన్ తల్లాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కథ,మాటలు శివ కాకు, సంగీతం రామ్ తవ్వ అందించగా కెమెరాకు శివ రాథోడ్, ఆర్.ఎస్ . శ్రీకాంత్ పని చేశారు.