
మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలే రీసెంట్ టైంలో ఏం రాలేదు. కొన్నాళ్ల క్రితం ఓటీటీ కోసం హిందీలో ఓ షో చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గత నెలలో లీడ్ రోల్ చేసిన ఓ తెలుగు సినిమా రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)
మంచు లక్ష్మీ పోలీస్‌గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దక్ష'. మోహన్ బాబు అతిథి పాత్రలో కనిపించారు. మర్డరీ మిస్టర్ థ్రిల్లర్ స్టోరీతో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వస్తే.. వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియనంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మంచు లక్ష‍్మీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి బిగ్ స్క్రీన్‌పై తేలిపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?
'దక్ష' విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. మరోవైపు దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. అతడు సేకరించిన సమాచారంతో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. ఇంతకీ హత్యలు చేసింది ఎవరు? దక్ష, మిథిలా (చిత్రా శుక్లా)కు సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)
