నా మిత్రురాలికి ఆల్‌ ది బెస్ట్‌.. ఐకాన్ స్టార్ ప్రశంసలు | Allu Arjun Praises Manchu Lakshmi Daksha Movie Trailer | Sakshi
Sakshi News home page

Allu Arjun: మీరిద్దరు తెరపై కనిపించడం అద్భుతం.. అల్లు అర్జున్ ప్రశంసలు

Sep 9 2025 9:08 PM | Updated on Sep 9 2025 10:09 PM

Allu Arjun Praises Manchu Lakshmi Daksha Movie Trailer

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా మూవీ ట్రైలర్రిలీజ్చేశారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్‌పై బన్నీప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ది బెస్ట్ చెప్పారు.

ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

అల్లు అర్జున్ రియాక్షన్పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్‌కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్‌లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్‌ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement