నా కల నిజమైంది.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్ | Manchu Lakshmi Shares Emotional Note about Latest Movie Dasksha | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: నా కల నిజమైంది.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్

Sep 21 2025 7:47 AM | Updated on Sep 21 2025 7:49 AM

Manchu Lakshmi Shares Emotional Note about Latest Movie Dasksha

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఇటీవలే దక్ష మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై రూపొందించిన ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాతో మోహన్ బాబు సైతం కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వస్తోంది.

ఈ నేపథ్యంలో దక్ష రిలీజ్ తర్వాత మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో తన తండ్రితో ఉన్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మీతో కలిసి దక్ష సినిమాని నిర్మించి.. మీతో కలిసి నటించే అవకాశం రావడం గర్వంగా ఉందని పోస్ట్‌ చేసింది. ఈ మూవీతో తన కల నిజమైందంటూ రాసుకొచ్చింది. మీ ఆశీస్సులు ఎల్లప్పుడు నాపై ఉండాలని మూవీ స్టిల్‌ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. దక్ష చిత్రంలో మంచు లక్ష‍్మీ పోలీస్ పాత్రలో అభిమానులను మెప్పించింది. ఈ మూవీలో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో కనిపించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement