
సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'దక్ష'. హారర్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీకి వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))
2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా శుక్రవారం(జూలై 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె పద్ధతిలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. 'దక్ష' స్టోరీ విషయానికొస్తే.. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. మరి చివరకు ఏమైంది? ఎవరు బతికారు అనేదే మిగతా స్టోరీ.
ఈ మూవీనే కాదు ఈ వారం చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో 'రోంత్' అనే పోలీస్ డ్రామా హాట్‌స్టార్‌లో.. షో టైమ్, మార్గన్ మూవీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో.. సోలో బాయ్, సారథి చిత్రాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోంత్, షో టైమ్, మార్గన్ కచ్చితంగా చూసే లిస్టులో ఉంటాయి.
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)