
బాలీవుడ్‌లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్‌దేవ్‌ని వివాహమాడాడు.
(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)
ఈ ఏడాది జూన్‌లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్‌లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.
సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్‌దేవ్‌తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్)