
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. కానీ ఎలాంటి ప్రకటన లాంటివి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది. 'జనాల్లేరు.. లైట్స్ లేవు.. సౌండ్ లేదు. ఫైనల్లీ మా పెళ్లి అయిపోయింది' అని మలయాళ నటి గ్రేస్ ఆంటోని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటి హీరోహీరోయిన్లు అందరూ కొత్త పెళ్లికూతురికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)
2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న గ్రేస్ ఆంటోని.. కుంబళంగి నైట్స్, నునక్కుళి, పరంతు పో, రోర్చా తదితరులు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా వచ్చిన తమిళ చిత్రం 'పరంతు పో'లో ఈమెనే హీరోయిన్. అయితే మలయాళ మూవీస్ ఓటీటీల్లో చూసే తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.
ఇప్పుడు సడన్‌గా తను పెళ్లి చేసుకున్నానని చెప్పి గ్రేస్ బయటపెట్టింది. కానీ భర్త ఎవరు? ఇండస్ట్రీకి వ్యక్తి అనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతానికైతే రెండు ఫొటోలు అవి కూడా ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా తీసుకున్న వాటిని మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని రోజుల్లో భర్త ఎవరు ఏంటి అనేది చెబుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్)