డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా | ManiShankar Movie Audio Launch | Sakshi
Sakshi News home page

డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా

Dec 23 2022 1:10 AM | Updated on Dec 23 2022 10:04 AM

ManiShankar Movie Audio Launch - Sakshi

శివ కంఠమనేని, సంజనా గల్రాని

శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్‌’. జీవీకే (జి. వెంకట్‌ కృష్టణ్‌) దర్శకత్వంలో కేఎస్‌ శంకర్‌ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్‌ నిర్మించారు. ఎంఎల్‌ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘మణిశంకర్‌’ బిగ్‌ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న నటుడు మురళీ మోహన్, నిర్మాత సి. కల్యాణ్‌ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలతో యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జి. వెంకట్‌ కృష్టణ్‌. ‘‘నా ఫ్రెండ్స్‌ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ జె. ప్రభాకర్‌ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్‌ రాజా పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement