-
డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా
శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్’. జీవీకే (జి. వెంకట్ కృష్టణ్) దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ నిర్మించారు. ఎంఎల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘మణిశంకర్’ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్ సీఈవో సతీష్ రెడ్డి విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న నటుడు మురళీ మోహన్, నిర్మాత సి. కల్యాణ్ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జి. వెంకట్ కృష్టణ్. ‘‘నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్ రాజా పాల్గొన్నారు. -
Manishankar Teaser: డబ్బు ప్రతి ఒక్కరిని శాసిస్తోంది
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘మణిశంకర్”. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ-కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్కృష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా మణిశంకర్ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేశారు.‘డబ్బు ప్రతి ఒక్కరిని శాసిస్తోంది. ఓడిస్తుంది. ఓడిన ప్రతివాడిని గెలిపిస్తుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీజర్ విడుదల అనంతరం కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - ``మణిశంకర్ పోస్టర్స్, టీజర్ చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకుని దర్శకుడు జీవీకే ఈ స్క్రిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. రియలెస్టిక్‌గా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి జీవీకే, శివ కెరీర్‌కు హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ మణిశంకర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్` అన్నారు. చిత్ర దర్శకుడు జీవీకే మాట్లాడుతూ - ‘మణిశంకర్ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్. మంచి కంటెంట్‌ని యాక్షన్ మోడ్, సస్పెన్స్ వేలో చెప్పడం జరిగింది. మంచి టీమ్ తో కలిసి పనిచేశాం కాబట్టి ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది` అన్నారు.‘మణిశంకర్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ చేసే కొన్ని డీలింగ్స్‌కి సంభందించిన కథ. సంజన, చాణుక్య, ప్రియా హెగ్డే ఈ నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ. ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’అన్నారు హీరో శివ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
HBD Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement