Manishankar Movie Teaser Launched By Director Kalyan Krishna - Sakshi
Sakshi News home page

Manishankar Teaser: డబ్బు ప్రతి ఒక్కరిని శాసిస్తోంది

Mar 19 2022 5:25 PM | Updated on Mar 19 2022 5:51 PM

Manishankar Movie Teaser Launched By Kalyan Krishna - Sakshi

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మణిశంకర్”. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించింది.

తాజాగా మ‌ణిశంక‌ర్ మూవీ టీజ‌ర్‌ను  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ విడుద‌ల చేశారు.‘డబ్బు ప్రతి ఒక్కరిని శాసిస్తోంది. ఓడిస్తుంది. ఓడిన ప్రతివాడిని గెలిపిస్తుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజర్‌ విడుదల అనంతరం కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ  - ``మ‌ణిశంక‌ర్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని ద‌ర్శ‌కుడు జీవీకే ఈ స్క్రిప్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. రియ‌లెస్టిక్‌గా ఉంది. ఈ సినిమా మంచి స‌క్సెస్ సాధించి జీవీకే, శివ కెరీర్‌కు హెల్ప్ అవ్వాల‌ని కోరుకుంటూ మ‌ణిశంక‌ర్ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్` అన్నారు.  

చిత్ర ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ - ‘మ‌ణిశంక‌ర్ అనేది ఒక యాక్షన్ థ్రిల్ల‌ర్‌. మంచి కంటెంట్‌ని యాక్ష‌న్ మోడ్‌, స‌స్పెన్స్ వేలో చెప్ప‌డం జ‌రిగింది. మంచి టీమ్ తో క‌లిసి ప‌నిచేశాం కాబ‌ట్టి ఔట్‌ పుట్ చాలా బాగా వ‌చ్చింది` అన్నారు.‘మ‌ణిశంక‌ర్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ చేసే కొన్ని డీలింగ్స్‌కి సంభందించిన క‌థ‌. సంజ‌న‌, చాణుక్య‌, ప్రియా హెగ్డే ఈ నాలుగు పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థ‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. త‌ప్ప‌కుండా మీరంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది’అన్నారు హీరో శివ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement