
బిగ్‌బాస్ సీజన్-9 నుంచి ప్రియ ఎలిమినేట్ తర్వాత శ్రీజలో కాస్త ఎక్కువ ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్‌లో శ్రీజ చాలా జాగ్రత్తగా తన ఆట ఆడింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనే స్ట్రాటజీ శ్రీజ వేసింది. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్స్ కంటే ఇమ్యూనిటీ టాస్కులు పెట్టి బిగ్‌బాస్ తన పంతా మార్చుకున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. సోమవారం ఎపిసోడ్‌లో కిచెన్ చుట్టూ సంజన, తనూజ మధ్య పెద్ద వార్ నడిచింది. అయితే, తనూజపై సంజనా చేసిన కామెంట్స్‌ను బిగ్‌బాస్ కొన్ని టెలికాస్ట్ చేయలేదు. కేవలం తనూజాదే తప్పు అన్నట్లుగా ఎపిసోడ్‌లో చూపించారు. లైవ్ చూసిన నెటిజన్లు ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.

సోమవారం ఎపిసోడ్ కిచెన్ నుంచే మొదలైంది. కొంచెం పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను సంజనా అడుగుతుంది. దీనికి తనూజ ఓకే చెప్పింది. దీంతో సంజనా కిచెన్ దగ్గరికెళ్లి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్‌తో చెప్పకుండానే తనపని తాను చేసుకుంటుంది. అలా మీరే ఫుడ్ చేసుకుంటే ఎలా అంటూ వాళ్లిద్దరూ ఆమెను ఆపేస్తారు. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేశాం మళ్లీ ఇది దేనికి అని డీమాన్ అడుగుతాడు. మరోవైపు దివ్య కూడా రెడీ అవ్వాలి ఎక్కువ టైమ్ లేదంటూ కెప్టెన్‌తో చెప్పింది. అప్పుడు శ్రీజతో చేయించుకుంటానని సంజన అంటుంది.
ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే తనూజ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చిదంటూ తనూజ అడుగుతుంది. దీంతో సంజనా ఫైర్ అవుతుంది. అయ్యో ఏంటమ్మా చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ తన నోటికి పని చెప్పింది. ఆమెకు కౌంటర్‌గా తనూజ కూడా వాయిస్ పెంచింది. నా డిపర్ట్‌మెంట్‌కి వచ్చి మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటూ సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన వాదనను పూర్తిగా బిగ్‌బాస్ చూపించలేదు.

సంజనా కావాలనే ట్రిగ్గర్ చేస్తుందా..?
సోమవారం ఎపిసోడ్ చూసిన వారందరూ తనూజాది తప్పు.. సంజనానే కరెక్ట్ అనుకుంటారు. కానీ, బిగ్‌బాస్ లైవ్ చూసిన వారికి మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో సంజనాది మొత్తం నెగటివ్‌నే ఉంటుంది. తనూజపై ఆమె దారుణమైన కామెంట్లు చేసినప్పటికీ వాటిని టెలికాస్ట్ చేయలేదు. దీంతో తనూజపై నెగటివిటీ కనిపిస్తుంది. బిగ్‌బాస్ లైవ్ చూసిన వారందరూ ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఆమె కావాలనే కంటెస్టెంట్స్‌ను ట్రిగ్గర్ చేస్తుందని అర్థం అవుతుంది. సంజనా రీఎంట్రీ కోసం తనూజ చేసిన సాయం గురించి తెలిసిందే.
కానీ, దానిని కూడా తక్కువ చేస్తూ ఆమె ఇమాన్యూల్‌తో విమర్శలు చేస్తుంది. అదొక సాయమా ఏంటి అంటూ దాటేసింది. ఆపై తనూజకు సిగ్గు, లజ్జా లేదంటూ సంజనా విరుచుకుపడింది. అదొక చీప్, చెత్త, చీప్ మెంటాలటీ అంటూ తనూజపై నోటికి వచ్చిన మాటలు సంజనా అనేసింది. ఆపై శ్రీజను కూడా విమర్శించింది. తన కోసం దుస్తులు కూడా త్యాగం చేయలేదంటూ శ్రీజను కూడా తిట్టేసింది. ఇవన్నీ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేయలేదు. దీంతో అందరూ సంజనానే కరెక్ట్ అంటూ అనుకోవడం సహజమే.

ఇద్దరికీ ఇమ్యూనిటీ
ఈ వారం నామినేషన్స్ నుంచి ఇద్దరికి ఇమ్యూనిటీ లభించింది. అందుకోసం 'వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు' అంటూ ఒక టాస్క్‌ను పెట్టారు. ఇందులో 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున ఆరు టీములుగా బిగ్‌బాస్ విభజించాడు. అయితే, ఫైనల్‌గా సుమన్ శెట్టి, తనూజ తమ గేమ్‌తో పాటు ఇంటి సభ్యుల సపోర్ట్‌తో ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకున్నారు.