
బిగ్‌బాస్ 9 మూడు వారాలు పూర్తయింది. ఆదివారం ఎపిసోడ్‌లో కామనర్ ప్రియ ఎలిమినేట్ అయింది. దీంతో ఈసారి ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారా? అని అనిపించింది. కానీ బిగ్‌బాస్ మాత్రం సోమవారం ఈ ప్రక్రియ పెట్టకుండా ఇమ్యూనిటీ కోసం గేమ్స్ ఆడిపించాడు. ఇందులో తనూజ, సుమన్ శెట్టి గెలిచి.. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు. కెప్టెన్ పవన్ ఎలానూ ఈ ప్రక్రియలో ఉండడు. మరి ఈ ముగ్గురు కాకుండా ఎవరెవరు నామినేషన్స్ లిస్టులో ఉన్నారు?
నామినేషన్ ప్రక్రియని ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ముగ్గురు చొప్పున మూడు జట్లగా విడగొట్టి వాళ్లతో గేమ్ ఆడిపించారు. ముగ్గురికి కలిపి ఓ ఎలస్టిక్ తాడు ఉంటుంది. దీని సహాయంతో హౌస్‌లో ఉన్న ఓ వస్తువుని చేతులతో తాకకుండా కింద పడకుండా తీసుకొచ్చి బయట లాన్‌లో పెట్టాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్ నుంచి ఒకరు వచ్చి ఓడిపోయిన జట్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్.. ఇంతకీ ఎవరితడు?)
అలా రెండుసార్లు ఎల్లో టీమ్ గెలిచింది. దీంతో ఈ జట్టులోని సుమన్ శెట్టి, రీతూని నామినేట్ చేశాడు. రాము.. సంజనని నామినేట్ చేశాడు. మొత్తంగా చూస్తే ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. రీతూ, సంజన, హరీశ్, ఫ్లోరా, శ్రీజ, దివ్య ఉన్నారు. వీళ్లలో దివ్య గతవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చింది. శ్రీజ కూడా గతవారం నామినేట్ అయింది కానీ కెప్టెన్ పవన్ సేవ్ చేయడంతో బయటపడింది. ఈసారి మాత్రం నామినేషన్స్ నుంచి తప్పించుకోలేకపోయింది.
అయితే నామినేషన్స్ లిస్ట్ చూస్తే ఈసారి శ్రీజ బయటకొచ్చేయడం గ్యారంటీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య కాకుండా మిగిలిన నలుగురు ఇప్పటికే నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయ్యారు. కాబట్టి వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఉంది. అలానే గతవారం వచ్చిన దివ్యపై ఆడియెన్స్‌లో కాస్త పాజిటివిటీ ఉండొచ్చు. అయినా సరే ఈమె కూడా శ్రీజతో పాటు డేంజర్ జోన్‌లో ఉండొచ్చు. మరి ఈ వీకెండ్ ఏం జరుగుతుందో? ఎవరు ఔట్ అవుతారో చూడాలి?
ఈ వారం నామినేట్ అయినోళ్లు
దివ్య
ఫ్లోరా
హరీశ్
రీతూ
సంజన
శ్రీజ
(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి 'ఓజీ'కి లేదుగా సాహో రేంజీ...)