
'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ టచ్ చేసిన అల్లు అర్జున్.. పార్ట్ 2తో సరికొత్త రికార్డులు కూడా సృష్టించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్నటివరకు బన్నీ డ్యాన్స్ అంటే టాలీవుడ్ లేదా బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ స్టెప్పులు కంపోజ్ చేసేవారు. ఇప్పుడు అట్లీతో మూవీ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్‌ని తీసుకొచ్చారు. ఇంతకీ ఇతడెవరు?
ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషి.. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం స్టెప్పులు కంపోజ్ చేయబోతున్నాడు. గత నెల రోజుల నుంచి ఓ భారతీయ సినిమా కోసం పనిచేస్తున్నానని అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ విషయాలు చెప్పకూడదు అంటూ ఇన్ స్టాలో కొనిషి ఓ పోస్ట్ పెట్టాడు. బన్నీతో ఇతడు కలిసున్న ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి 'ఓజీ'కి లేదుగా సాహో రేంజీ...)
కొనిషి.. డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్. పుట్టింది జపాన్‌లో పెరిగిందంతా ఇంగ్లాండ్‌లో. విచిత్రమైన అవతారంలో కనిపించే ఇతడికి పలు దేశాల్లో అభిమానులున్నారు. 15 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ లాంటివి నేర్చుకోకముందే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. హిప్ హాప్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అమెరికన్ హిప్ హాప్ 'క్వెస్ట్ క్రూ'తో కలిసి పనిచేశాడు.
అయితే అమెరికన్ రియాలిటీ షో 'సో యూ థింగ్ యూ కెన్ డ్యాన్స్' 1,2,3 సీజన్లలో పాల్గొని చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచినప్పటికీ అందరినీ ఆకట్టుకున్నాడు. 2008లోనే ఎమ్మ అవార్డ్ కూడా అందుకోవడం విశేషం. ఇలాంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు బన్నీకి స్టెప్స్ కంపోజ్ చేస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఆ పాట ఏ రేంజులో ఉండబోతుందో?
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. హీరో ఎవరంటే?)