
గతేడాది డిసెంబరు నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఇకపోతే నాగచైతన్య.. ఓ హారర్ మూవీలో నటిస్తుండగా శోభిత మాత్రం మొన్నటివరకు కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల గ్యాప్ ఇస్తుందా అనుకున్నార. కానీ అలాంటిదేం లేదని ఓ మూవీ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.
(ఇదీ చదవండి: హర్ట్ అయిపోయిన దీపిక పదుకొణె.. ఆ డైరెక్టర్‌తో కటీఫ్)
శోభిత ప్రెగ్నెన్సీతో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే అవి పుకార్లు మాత్రమేనని ఇప్పుడు ఓ తమిళ సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. పా.రంజిత్ తీస్తున్న 'వెట్టువం' అనే చిత్రంలో శోభితని తీసుకున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. గతంలో తమిళంలో మణిరత్నం తీసిన 'పొన్నియిన్ సెల్వన్'లో నటించింది. కాకపోతే అది హీరోయిన్ పాత్ర కాదు. ఇప్పుడు మాత్రమే ఈమెనే లీడ్.
దినేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శోభిత హీరోయిన్. పా.రంజిత్ సినిమాలన్నీ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత శోభిత.. తెలుగులో ఏమైనా మూవీస్ చేస్తుందని చాలామంది అనుకున్నారు కానీ తమిళంలో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. గతంలో తెలుగులో గూఢచారి, మేజర్ మూవీస్ చేసింది.
(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి లేదుగా సాహో రేంజీ...)
