
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో రెండుసార్లు కలిసి పనిచేసిన ఓ దర్శకురాలి మాటలకు హర్ట్ అయింది. ఆమె ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని మరీ సీరియస్‌గా తీసుకున్న దీపిక.. దూరం పెట్టేసింది. సోషల్ మీడియాలోనూ అన్ ఫాలో కొట్టేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా డైరెక్టర్?
కొన్ని రోజులు క్రితం దీపిక పదుకొణెని ప్రభాస్ 'స్పిరిట్' కోసం హీరోయిన్‌గా తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. ఈ మేరకు డిస్కషన్ జరిగింది. అంతా ఓకే అనుకునే టైంలో దీపిక చెప్పిన కండీషన్స్ నచ్చక.. సందీప్ తన మూవీ నుంచి దీపికని పక్కకు తప్పించాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ టైంలో చాలామంది సందీప్ కి సపోర్ట్‌గా నిలిచారు. మరికొందరు దీపికకు సపోర్ట్ చేశారు. మొన్నీమధ్య ప్రభాస్ 'కల్కి' టీమ్ కూడా దీపిక తాము తీయబోయే సీక్వెల్‌లో ఉండదని తేల్చి చెప్పారు.
(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్')
అయితే దీపిక.. రోజుకు 7 గంటలే పనిచేస్తానని చెప్పిందని, తన టీమ్ దాదాపు 25 మంది కోసం ఫైవ్ స్టార్ హోటల్‌లో రూమ్స్, ఫుడ్ లాంటివి కావాలని అడిగిందని.. అలానే రెమ్యునరేషన్ కూడా తొలి పార్ట్‌కి తీసుకున్న దానికంటే భారీగా డిమాండ్ చేసిందని.. అందుకే 'కల్కి' మేకర్స్ దీపికని తప్పించారని మాట్లాడుకున్నారు. తాజాగా ఓ షోలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరా ఖాన్ పాల్గొంది. నటీనటుల వర్కింగ్ అవర్స్(పనిగంటలు) గురించి ఫన్నీగా కామెంట్ చేసింది.
'ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు, ఇక ఈ షోకు ఎలా వస్తారా? ఆమెకు అంత టైమ్ ఎక్కడ ఉంటుంది' అని చెప్పి దీపికని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఫరా ఖాన్ ఫన్నీగా మాట్లాడింది. ఈ మాటలకు దీపిక బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉంది. ఇన్ స్టాలో ఫరా ఖాన్‌ని అన్ ఫాలో చేసింది. దీంతో ఫరా కూడా దీపికని అన్ ఫాలో చేసింది. గతంలో ఫరా తీసిన 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూఇయర్' సినిమాల్లో దీపికనే హీరోయిన్. కానీ ఇప్పుడు కామెడీగా చేసిన కామెంట్స్ ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్లు కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!)