
కొన్నిరోజుల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల తెగ వైరల్ అయిపోయింది. 'జూనియర్' సినిమాలోనిది ఆ పాట. అయితే దాదాపు రెండున్నర నెలల క్రితం థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ఓటీటీ సంగతి మాత్రం పూర్తిగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒకేసారి రెండింటిలో స్ట్రీమింగ్ అయిపోయింది. ఇంతకీ ఈ మూవీ వేటిలో చూడొచ్చు.
గాలి జనార్ధన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం 'జూనియర్'. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ముందే ప్రకటించినట్లు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.
(ఇదీ చదవండి: 1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం)
ముందే చెప్పినట్లు ఆహా ఓటీటీలోకి రాగా.. ఏ మాత్రం హడావుడి లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి కూడా వచ్చేసింది. ఈ రెండింటిలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో కన్నడ వెర్షన్ అందుబాటులో ఉంది.
'జూనియర్' విషయానికొస్తే.. అభి (కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు. అలా జాలీగా ఇంజినీరింగ్ చేస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన స్పూర్తి(శ్రీలీల) పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అదే కంపెనీకి బాస్ అయిన విజయ(జెనీలియా)కి అభి అస్సలు నచ్చడు. అయితే వీళ్లిద్దరికీ ఓ గతం ఉంటుంది. ఒకరంటే ఒకరిని పడని అభి-విజయ.. విజయనగరం అనే ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!)