
డ్రగ్స్ కేసులో సినీ నటి సంజన గల్రానీకి సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ సమయంలో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనా గల్రానీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో 14వ నిందితురాలిగా సంజనాను చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
సంజన గల్రానీపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024 మార్చి 25న, కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, Section 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్‌లో జరపలేమని పేర్కొంది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు సంజనా గల్రానీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.
సంజన గల్రానీ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పేర్కొన్నారు.. ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని, అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు. సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న చాలామంది డ్రగ్స్ వాడినట్టు సమాచారం ఉంది. విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు. కానీ, ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమచారం. ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.
బిగ్‌బాస్9లో సంజన
బిగ్‌బాస్9 తెలుగు సీజన్‌లో సంజన గల్రానీ సత్తా చాటుతున్నారు. ఈ సీజన్‌కు హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందారు. అయితే, ఎలిమినేషన్ పేరుతో ఆమెను సీక్రెట్ రూమ్‌కు బిగ్‌బాస్ పంపారు. ప్రస్థుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఆమె రాణిస్తున్నారు.