నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
నామినేషన్స్ లొల్లి
తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్‌రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.
తనూజను ఎప్పుడో వదిలేశా!
అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.

ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజ
మరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.
దొంగలుగా హౌస్‌మేట్స్
బిగ్‌బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్‌లో ముంచేశారు.


