Live Updates
బిగ్‌బాస్-9 ఫైనల్.. లైవ్ అప్‌డేట్స్.. ఇద్దరు ఎలిమినేట్
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు
- 3వ రన్నర్‌గా నిలిచిన ఇమ్మాన్యుయేల్
- టాప్-5 నుంచి సంజన, ఇమ్ము ఇప్పటి వరకు ఎలిమినేట్.. హౌస్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్
- ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రమోషన్ కోసం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి
- సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న మూవీ విడుదల
- నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి ద్వారా ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
- ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశావంటూ.. ఇమ్మును అభినందించిన నాగార్జున
- ఇమ్ము ఎలిమినేట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు
నటుడు శ్రీకాంత్ ద్వారా 'సంజన' ఎలిమినేట్
- ఫస్ట్ ఎలిమినేట్ చేసేందుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు శ్రీకాంత్
- కామనర్స్ కల్యాణ్, పవన్‌లకు అభినందనలు
- కామెడీ కింగ్ ఇమ్మాన్యుయేల్ అంటూ శ్రీకాంత్ ప్రశంస
- సంజనతో కలిసి 'దుశాసన్' చిత్రంలో నటించానని గుర్తుచేసుకున్న శ్రీకాంత్
- టాప్-5 నుంచి సంజన్ ఫస్ట్ ఎలిమినేట్
- ప్రస్తుతం హౌస్‌లో నలుగురు కంటెస్టెంట్స్
'ఛాంపియన్' ప్రమోషన్‌లో రోషన్, అనస్వర రాజన్
శ్రీకాంత్ కుమారుడు రోషన్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నాగ్
పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న విడుదల
బిగ్‌బాస్ అన్ని సీజన్లను తన తండ్రి శ్రీకాంత్ చూశారని చెప్పిన రోషన్
బిగ్‌బాస్‌లో మంగ్లీ పాట
- రీసెంట్‌గా మంగ్లీ పాడిన పాట నెట్టింట్ వైరల్ అవుతుంది
- 'బాయిలోనే బల్లిపలికే' సాంగ్‌తో అలరించిన మంగ్లీ
- పాటతో పాటు స్టెప్పులు కూడా వేసిన మంగ్లీ
వేదికపై తనూజ చెల్లి, అమ్మ
- ఫైనల్ వేదికపై తనూజ అమ్మ సావిత్రి, చెల్లి పూజ
- కల్యాణ్ తల్లిదండ్రులు లక్ష్మణరావు, లక్ష్మీ ఎంట్రీ
- సంజన భర్త అజీజ్ వేదికపై ఎంట్రీ
- బిగ్‌బాస్ చరిత్రలో ఈ సీజన్ టీఆర్‌పీ రేటింగ్ సూపర్ అంటూ నాగ్ ప్రకటన
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్.. ఇద్దరు దూరం
బిగ్‌బాస్ తెలుగు 9లోకి మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.
ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఫైనల్ ఎపిసోడ్‌కు వచ్చారు.
అందరితో సరదాగా నాగార్జున మాట్లాడారు.
టాప్- 5 కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఫైనల్‌కు ఎపిసోడ్‌కు వచ్చేశారు.
దివ్య, శ్రేష్టి వర్మ మాత్రం స్టేజీపై కనిపించలేదు.. కానీ, ఎపిసోడ్ మధ్యలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.
అభిమానులకు కల్యాణ్, పవన్ రిక్వెస్ట్
- బిగ్‌బాస్ సెట్ వద్దకు ఎవరూ రాకూడదని ఫ్యాన్స్‌కు కల్యాణ్ పడాల, డీమాన్ పవన్ రిక్వెస్ట్
- జనాలు గుమి కూడి ఉండేందుకు పోలీసుల నుంచి అనుమతి లేదని ప్రకటన
- ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్న పోలీసులు
- బిగ్‌బాస్ సెలబ్రేషన్స్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తామన్న కల్యాణ్ టీమ్
బిగ్‌బాస్-9 ఫైనల్.. లైవ్ అప్‌డేట్స్..
బిగ్‌బాస్‌లో 105 రోజుల రణరంగం.. చివరి అంకానికి చేరింది. ఈరోజు ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలోపు బిగ్‌బాస్ తెలుగు 9 ట్రోఫీ విజేత ఎవరు అనేది తేలిపోతుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉన్నారు. వీరిలో విజేత ఎవరు..? సూటుకేసు తీసుకునేది ఎవరు..? అనేది తేలిపోతుంది. అయితే, తనూజ- కల్యాణ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవనున్నారని తెలిసిందే.


