డ్ర‌గ్ టెస్టుకు అంగీక‌రించని సంజ‌నా

Sanjana Galrani Refuse To Undergo Dope Test - Sakshi

బెంగ‌ళూరు: శాండ‌ల్‌వుడ్‌ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో బ‌హుభాషా న‌టి సంజ‌నా గ‌ల్రాని అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఆమెపై సీసీబీ(సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్‌) పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో డోప్ టెస్టు చేయించేందుకు ఆమె నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. డ్ర‌గ్ టెస్టు నిమిత్తం గురువారం ఉద‌యం ఆమెను బెంగ‌ళూరులోని కేపీ జ‌న‌ర‌ల్‌ ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా.. పోలీసులతో, వైద్యుల‌తో వాగ్వాదానికి దిగారు. టెస్టు చేయించుకోన‌ని తేల్చి చెప్పారు. త‌ను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, అలాంట‌ప్పుడు ఎందుకు ప‌రీక్ష చేయించుకోవాల‌ని ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. (చ‌ద‌వండి: టచ్‌లో బడాబాబులు)

"నేనేం త‌ప్పు చేయ‌లేదు. అయినా ఎందుకు అరెస్ట్ చేశారు? అంద‌రి ముందు న‌న్ను బ‌క‌రా చేస్తున్నారు. నాకు పోలీసుల‌పై న‌మ్మ‌కం న‌శిస్తోంది. న‌న్ను ర‌క్షిస్తామ‌ని మీడియా ముందు చెప్పారు, ఇప్పుడేమో ర‌క్త‌ప‌రీక్ష చేయించుకోమ‌ని ఒత్తిడి చేస్తున్నారు. మిమ్మ‌ల్ని ఎలా న‌మ్మాలి?  నేను త‌ప్పు చేసిన‌ట్టు ఏ సాక్ష్యం లేక‌పోయినా న‌న్ను బ‌లిప‌శువును చేసి ఇక్క‌డికి తీసుకువ‌చ్చారు. ప‌రీక్షకు అంగీక‌రించ‌డం, అంగీక‌రించ‌క‌పోవ‌డం నా హ‌క్కు. నేను చేయించుకోను" అంటూ సంజ‌నా పోలీసుల‌పైకే ఎదురు తిరిగారు. కాగా డ్ర‌గ్స్ కేసులో సంజ‌నా స‌న్నిహితుడు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్ప‌టికే అరెస్ట్ అయ్యాడు. అత‌డి ఫోన్‌లో స్వాధీనం చేసుకున్న స‌మాచారం ఆధారంగా పోలీసులు ప‌లువురికి నోటీసులు ఇచ్చారు. ఈక్ర‌మంలో న‌టి రాగిణి ద్వివేదిని, సంజ‌న గ‌ల్రానిని సైతం అరెస్ట్ చేశారు. (చ‌ద‌వండి: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు: సంజన అరెస్టు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top