తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం మైనస్‌గా మారనుంది.
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్‌గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
రాజాతో రీప్లేస్ చేశావా?
ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్‌తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్‌ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్‌గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్‌కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు.
తోసేసినా వెళ్లనంటోంది
వచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్‌గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది.

మాధురికి క్లాస్
ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్‌లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్‌కు ఇవ్వడం.. కంటెండర్‌షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది.
బయట తోపు.. ఇక్కడ కాదు!
బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్‌బాస్ హౌస్‌లో కాదు అని కాస్త సాఫ్ట్‌గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో ఫేక్ బాండ్స్, ఇన్‌సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.


