Bigg Boss 5 Telugu: పింకీకి పెరుగుతున్న మద్దతు.. 'మార్పు తీసుకొద్దాం..ఎంకరేజ్‌ చేయండి'

Bigg Boss Telugu 5: Sanjjanaa Galrani Support To Priyanka Singh - Sakshi

Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 అదరగొడుతుంది. అప్పుడే హౌస్‌లో అలకలు, గ్రూపు రాజకీయాలు, లవ్‌ యాంగిల్స్‌ మొదలైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్కుల విషయానికి వచ్చే సరికి ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్‌ను హీటెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్‌మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌ ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ట్రాన్స్‌ జెండర్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్‌ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటా, బయటా మంచి మార్కులే కొట్టేస్తుంది. ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. ఇటీవలె నటుడు నాగబాబు సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. హౌస్‌లో తనకు తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నా, తన పూర్తి సపోర్ట్‌ మాత్రం ప్రియాంకకే అని ఇదివరకే ఆయన ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ సైతం ప్రియాంకకు తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్‌జెండర్స్‌ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్‌ కార్నర్‌ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్‌ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి' అంటూ సంజన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పిలుపునిచ్చింది.

కన్నడ నటి అయినప్పటికీ ఒక తెలుగు షో గురించి మాట్లాడటమే కాకుండా, ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్‌ చేయమని రిక్వెస్ట్‌ చేస్తుండటంపై పింకీ(ప్రియాంక సింగ్‌)ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తొలి వారం సరయూ ఎలిమినేట్‌ కాగా ఈవారం ఉమాదేవి, కాజల్‌, ప్రియ,నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబోలతో పాటు ప్రియాంక సింగ్‌లు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే లోబో, ప్రియాంక సింగ్‌, ప్రియలు సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు అన్‌ అఫీషియల్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తుంది. మరి వీరిలో ఈవారం హౌస్‌ నుంచి బయటకు ఎవరు వెళ్తారన్నది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే.

చదవండి : ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్‌ ఇచ్చిన లోబో!
టీఆర్పీ రేటింగ్‌లో సత్తా చూపిన బిగ్‌బాస్‌ 5, కానీ..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top